సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలసంకేతాలతో ఆరంభంలోనే డబుల్ సెంచరీ నష్టాలు మూటగట్టకున్న అనంతరం మరింత దిగజారాయి. సెన్సెక్స్ 253 పాయింట్లు పతనమై 35630 వద్ద, నిఫ్టీ 88పాయింట్లు క్షీణించి 10,694 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ 10700 స్థాయికి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఇంకా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తదితర బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
జెఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా, టాటా స్టీల్,హిందాల్కోకౌంటర్లు 3శాతం, ఐవోసీ2 శాతం నష్టాల్లో కొనసాగుతోంది. అయితే రూపాయి బలహీనంగాఉండటంతో ఐటీ లాభపడుతోంది. సన్‌ఫార్మ 3శాతం, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment