సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 450 పాయింట్లు పతనంనిఫ్టీ 100 పాయింట్లు దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్359 పాయింట్లు పతనమై 33,675వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 10,120 వద్ద ట్రేడవుతోంది. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే.
ఇండియాబుల్స్, బ్రిగేడ్, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్, శోభా నష్టపోతుండగా మెటల్ కౌంటర్లలో హిందాల్కో, వేదాంతా, జిందాల్ స్టెయిన్‌లెస్, ఎన్‌ఎండీసీ, హింద్ కాపర్, సెయిల్, జిందాల్ స్టీల్, నాల్కో, టాటా స్టీల్ క్షీణించాయి. వీటితోపాటు మదర్‌సన్ సుమీ, ఐషర్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టీవీఎస్, హీరోమోటో, మారుతీ, బాష్ కూడా నష్టపోతున్నాయి. మరోవైపు విప్రో, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment