![Corporation bank has huge losses - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/18/Untitled-6.jpg.webp?itok=z3dRtUIB)
ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలం లో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 17.35% నుంచి 15.35%కి తగ్గాయి.
ఎన్‌పీఏలకు మార్చి త్రైమాసికం లో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. బీఎస్‌ఈలో షేరు ధర ఫ్లాట్‌గా రూ.25.50 వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment