corporation bank
-
ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్!
ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. తద్వారా వివిధ ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు లావాదేవీలు కూడా మారనున్నాయి. ఈ మార్పులు వల్ల ఆయా బ్యాంకు యూజర్లు ప్రభావితం కానున్నారు. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అలా విలీనం అయిన బ్యాంకుల్లో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల పాత బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు నిలిపివేయనున్నారు. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి)లో, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. పిఎన్‌బి, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం అయిన బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి సంబంధిత బ్యాంకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. పాత బ్యాంకుల బ్యాంకింగ్ ఆధారాలు 2021 మార్చి 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉన్నందున పాస్‌బుక్, చెక్‌బుక్, ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు అని వారు సమాచారం ఇచ్చారు. సిండికేట్ బ్యాంకు యూజర్లకు ఊరట అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయినసంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా సిండికేట్ బ్యాంక్ తమ కస్టమర్లకు కొంత ఊరటనిచ్చింది. ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్‌బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారి ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. చదవండి: జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు! సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్!
ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖలు విలీనం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ లు కలిగిన కొత్త చెక్ పుస్తకాలను పొందవలసి ఉంటుందని యుబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్) లావాదేవీల సమయంలో బ్యాంక్ శాఖను గుర్తించడానికి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్(ఐఎఫ్ఎస్సీ) కోడ్ ఉపయోగిస్తారు. అలాగే, చెక్ ప్రాసెసింగ్ కోసం మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఎంఐసీఆర్) కోడ్ ను ఉపయోగిస్తారు. పాత ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ శాఖల ఐఎఫ్ఎస్సి, ఎంఐసీఆర్ కోడ్ లు గల చెక్ బుక్స్ 2021 మార్చి 31 వరకే పనిచేస్తాయి. పాత బ్యాంక్ వినియోగదారులు తమ బ్రాంచ్ నుంచి కొత్త చెక్ బుక్ పొందాలని లేదా మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యుబిఐ బ్యాంకు కోరింది. అయితే, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యూజర్లు యూనియన్ బ్యాంకుకు మారినా పాత అకౌంట్ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్ నెంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్ ఐడీ కూడా పాతదే ఉంటుంది. కోత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 లేదా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110కు సంప్రదించవచ్చు. చదవండి: ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడండిలా! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
ఐదో అతిపెద్ద బ్యాంక్ యూబీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్‌లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్‌లను మూడింట్లో ఏ బ్యాంక్‌లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. -
నేడు ఆంధ్రా బ్యాంక్ చివరి వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. -
కార్పొరేషన్ బ్యాంకు భారీ నష్టాలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలం లో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్పీఏలు మాత్రం 17.35% నుంచి 15.35%కి తగ్గాయి. ఎన్పీఏలకు మార్చి త్రైమాసికం లో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. బీఎస్ఈలో షేరు ధర ఫ్లాట్‌గా రూ.25.50 వద్ద క్లోజయింది. -
వడ్డీ చెల్లించినా బంగారం వేలం
రాయదుర్గం రూరల్: వ్యవసాయ పెట్టుబడుల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను రైతుకు తెలపకుండా కార్పొరేషన్ అధికారులు వేలం వేసేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి తిప్పేస్వామి వ్యవసాయ పెట్టుబడుల కోసం తన భార్య నాగలక్ష్మి బంగారు నెక్లెస్‌ను 2013లో కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ప్రతి ఏటా వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నాడు. 2017 ఆగస్టు నుంచి వడ్డీ చెల్లించలేదు. 2018 జూన్ ఐదో తేదీన అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపించారు. కానీ రైతుకు జూలై 15న నోటీసు అందింది. జూలై 16న బ్యాంకుకు వచ్చి గోల్డ్‌లోన్ ఖాతాకు రూ.4వేల వడ్డీ చెల్లించి రెన్యూవల్ రసీదు తీసుకున్నాడు. కానీ అదే నెల 20 వతేదీన బ్యాంకు వారు బంగారు నెక్లెస్‌ను బహిరంగవేలంలో రూ.29,200కు విక్రయించేశారు. ఈ విషయం రైతు తిప్పేస్వామికి తెలియదు. రుణం తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తానని, తన బంగారును ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే మీ బంగారాన్ని గత సంవత్సరం ఆగస్టులోనే వేలం వేసేశామని చెప్పడంతో రైతు గుండెలపై బండరాయి వేసినంత పనైంది. బంగారాన్ని వేలం వేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు తనవద్ద నుంచి వడ్డీ మొత్తంలో రూ.4వేలు ఎలా కట్టించుకున్నారని ప్రశ్నిస్తున్నాడు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాలకు తాము బలైపోయామని బాధితుడు కావలి తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు వెళతానని చెప్పాడు. ఈ విషయంపై రాయదుర్గం కార్పొరేషన్‌బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జయరాంను వివరణ కోరగా ఈ విషయం జరిగినప్పుడు తాను లేనన్నారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకునే హక్కు ఉందన్నారు. -
మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి
ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్లక్ష్మి బ్యాంక్ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల పనితీరును మదింపు చేసిన మీదట పీసీఏపరమైన ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చిన నేపథ్యంలో వాటి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుండటం ఇందుకు కారణమని వివరించింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి కార్పొరేషన్ బ్యాంకు వితరణ చేసిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 17.36 శాతంగా ఉండగా, అలహాబాద్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 17.81 శాతం స్థాయికి చేరాయి. దీంతో వీటిని పీసీఏ పరిధిలోకి చేర్చి.. రుణవితరణ, వ్యాపార విస్తరణ మొదలైన కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీసీఏ పరిధిలోని బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే జనవరి 31న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, ఇప్పటికీ మరో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్) పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. -
కార్పొరేషన్ బ్యాంకు ఎండీగా పీవీ భారతి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా పి.వి.భారతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1, ఆ తర్వాత ఆమె నూతన బాధ్యతలు స్వీకరిస్తారని, 2020 మార్చి 31 వరకు కార్పొరేషన్ బ్యాంకు ఎండీ, సీఈవో బాధ్యతల్లో ఉంటారని కేంద్రం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, కార్పొరేషన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బిరూపాక్ష మిశ్రా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాలకృష్ణ ఆల్సేను నియమిస్తున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ మరో ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం మిశ్రా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండి యా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ కార్పొరేషన్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఇక కార్పొరేషన్ బ్యాంకు మరో జన రల్ మేనేజర్ కె.రామచంద్రన్‌ను అలహాబాద్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. -
డీకే ఆప్తుల ఇళ్లపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై గురువారం సీబీఐ దాడులు చేపట్టింది. బెంగళూరు, రామనగర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమంగా నోట్లను మార్చినట్లు డీకేపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. 2016 నవంబర్ 14న కొందరు రూ.10 లక్షల పాత నోట్లను అక్రమంగా రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకులో మార్చారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపించకుండా కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను డీకే సోదరుల ఆప్తులు మార్చుకున్నట్లు 2017లో కేసు దాఖలైంది. దీనిపై కోర్టు వారెంటుతో వచ్చిన సీబీఐ అధికారులు డీకే సోదరుల సన్నిహితులైన శివానంద, నంజప్ప, పద్మనాభయ్యల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సీబీఐ సోదాలపై ఎమ్మెల్యే డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడనన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎవరూ ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని చెప్పారు. -
బంగారు ఆభరణాలివ్వకపోతే ఊరుకోం
ఆకివీడు: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వకుండా నోటీసులు జారీ చేయడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం కా ర్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు శాఖలో బం గారు ఆభరణాలు మాయమైన విష యం విదితమే. బ్యాంక్ మేనేజర్, అప్రయిజర్ కలిసి బంగారు ఆభరణాలను కాజేశారంటూ అప్పట్లో బాధితులు రెండు నెలలకు పైగా ఆందోళనలు చేశా రు. బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు వచ్చి బంగారు ఆభరణాలకు సొమ్ములు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఏడాది తర్వాత బాధితులకు రూ.47 లక్షల మేర చెల్లించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో మాయం చేసిన సొత్తులో కరిగిం చని ఆభరణాల్ని, కరిగించిన బంగారు ముద్దను కోర్టుకు సమర్పించారు. కోర్టులో ఉన్న విషయాన్ని పట్టించుకోని బ్యాంకు అధికారులు కరిగించిన ఆభరణాలకు చెందిన బాధితులకు నగదు చెల్లించారని, తమ ఆభరణాలకు కూడా నగదు చెల్లించాలని లేకుంటే ఆభరణాలు ఇవ్వాలని మిగిలిన ఖాతాదారులు మొత్తుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని బాధితులు బుధవారం బ్యాంకు మేనేజర్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తమ ఆభరణాలు ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి బాకీ చెల్లించమని ఒత్తిడి చేయడం దారుణమని బాధితులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్లో ఆవేదన వెళ్లగక్కారు. నోటీసును ఉపసంహరించుకుని రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని డీజీఎం హామీ ఇచ్చారని వినియోగదారుల రక్షణ మండలి రాష్ట్ర సభ్యుడు బొబ్బిలి బంగారయ్య విలేకరులకు తెలి పారు. బాకీ మొత్తం చెల్లించిన బాధితులకు ఆభరణాలు ఇవ్వమంటే కోర్టులో ఉన్నాయని చెబుతున్నారని, కొద్దిమొత్తం బకాయి ఉన్న వ్యక్తులకు బకాయి క ట్టమని నోటీసులు జారీ చేయడం స మంజసం కాదన్నారు. 48 గంటల్లో స మస్య పరిష్కరించకపోతే బ్యాంక్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బాధితులు నంద్యాల సీతారా మయ్య, కందుల సత్యనారాయణ, అ ప్పారావు, శిరిగినీడి భాస్కరరావు, బ చ్చు కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు. -
డిఫాల్టర్ల ఇళ్ల ఎదుట మౌన ప్రదర్శనలు
బాకీల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నిర్ణయం హైదరాబాద్: రుణ బకాయిల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నూతన మార్గాన్ని ఎంచుకుంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారుల ఇళ్లు, కంపెనీల కార్యాలయాల ముందు బ్యాంకు ఉద్యోగులు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. రుణ చెల్లింపుల దిశగా వారిపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, విఫలమైతే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. -
స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మరోదఫా రుణ రేటును స్వల్పంగా 0.10% తగ్గించింది. దీనితో ఓవర్‌నైట్‌కు సంబంధించి రేటు 8.75 శాతానికి పడింది. మూడు నెలల కాలానికి 8.85 శాతానికి తగ్గుతుంది. ఏడాది కాలానికి 8.95 శాతానికి దిగివస్తుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత ఈ రుణ రేటు (ఎంసీఎల్ఆర్) నవంబర్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 4వ తేదీన ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.25 శాతం)ను పావుశాతం తగ్గించిన వెంటనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించిన మొట్టమొదటి బ్యాంకుగా ఐసీఐసీఐ నిలిచింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత వార్షిక రుణ రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనికి తాజా తగ్గింపు అదనం. కార్పొరేషన్ బ్యాంక్ కూడా... ఇదిలావుండగా, ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్ కూడా రుణ రేటును 0.05 శాతం తగ్గించింది. -
కార్పొరేషన్ బ్యాంక్ బాధితులకు వారంలో న్యాయం
ఆకివీడు : స్థానిక కార్పొరేషన్ బ్యాంక్‌లో బంగారు ఆభరణాలు, దస్తావేజులు మాయమైన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డీజీపీ ఎన్.సాంబశివరావు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆకివీడు పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించిన డీజీపీని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య, బాధితులు కలిశారు. ఎంపీ గంగరాజు కూడా బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన డీజీపీ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు కేసును అప్పగించారు. వారంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్చి వివాదం పరిష్కరించాలి స్థానిక సీబీసీఎన్సీ బాప్టిస్ట్ చర్చి వివాదాన్ని పరిష్కరించాలని డీఎస్పీ పూర్ణచంద్రరావును డీజీపీ ఆదేశించారు. చర్చి ఆస్తులను అమ్మేసుకున్నారని చర్చికి చెందిన కొంత మంది పెద్దలు డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన కేసు వివరాలను ఎస్సై అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ కేసును త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ డీఎస్పీని ఆదేశించారు. -
82 శాతం తగ్గిన కార్పొరేషన్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: .కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం పడిపోయింది. 2015 ఇదే కాలంలో రూ.204.2 కోట్లుగా ఉన్న లాభం, తాజా సమీక్షా కాలంలో రూ.53.3 కోట్లకు తగ్గింది. మొండిబకాయిలకు సంబంధించి అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. కాగా ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,335 కోట్ల నుంచి రూ.5,241 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ తదితర కేటాయింపులు రూ.621 కోట్ల నుంచి రూ.895 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిలు 5.43 శాతం నుంచి 11.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏల విషయంలో ఈ శాతం 3.55 శాతం నుంచి 7.22 శాతానికి పెరిగింది. -
బ్యాంకులో 329 కాసుల బంగారం మాయం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచిలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన 329 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. రూ.70 లక్షల విలువైన నగలను ఇంటిదొంగలే కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు పెద్దఎత్తున బ్యాంక్‌కు చేరుకుని తమ నగలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. కార్పొరేషన్ బ్యాంకులో బంగారు ఆభరణాల మాయం వ్యవహారం సంచలనం సృష్టించింది. స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచిన సుమారు 329 కాసుల ఆభరణాలున్న సంచులు మాయం కావడంతో అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు శనివారం స్థానిక రైస్‌మిల్లర్ చుండూరి వెంకట సత్యనారాయణ బ్యాంకుకు వచ్చారు. ఆ సమయంలో నగల కోసం బ్యాంకు స్ట్రాంగ్లోకి వెళ్లిన సిబ్బందికి సత్యనారాయణ ఆభరణాలు కనిపించలేదు. దీంతో విషయాన్ని బ్యాంకు మేనేజర్ ఎం.ఎన్.వి.ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం రావాలని సత్యనారాయణకు సూచించారు. ఆ తర్వాత బ్యాంకు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. మొత్తం 1433 మంది తనఖా పెట్టిన సుమారు 329 కాసుల బంగారు ఆభరణాలు ఉన్న 19 సంచులు మాయమైనట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.70లక్షలు ఉంటుందని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో రుణగ్రస్తులు భారీగా సోమవారం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ ఆభరణాల గురించి వాకబు చేశారు. ఆభరణాల మాయంపై బ్యాంకు డిప్యూటీ జోనల్ మేనేజర్ వారణాసి బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ అశోక్‌కుమార్ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆభరణాల మాయంపై ఆరా తీశారు. బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌తోపాటు మరో నలుగురు సిబ్బందిని, అప్రైజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు కనబడని ఖాతాల జాబితాను బ్యాంకు వద్ద ప్రదర్శించారు. రుణగ్రస్తులు ఆ జాబితాలు చూసుకున్నారు. బ్యాంకు సిబ్బందే తమ ఆభరణాలను మాయం చేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎస్ఐ రుణగ్రస్తులతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి రుణగ్రస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కార్పొరేషన్ బ్యాంక్ నష్టం రూ.519 కోట్లు
మొండి బకాయిల కేటాయింపుల ప్రభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.510 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా ఈ స్థాయి నష్టాలు వచ్చాయని కార్పొరేషన్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.45 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.926 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రెట్టింపై రూ.1,960 కోట్లకు చేరాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.5,385 కోట్ల నుంచి రూ.5,219 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 4.81 శాతం నుంచి 9.98, అలాగే నికర మొండి బకాయిలు 3.08 శాతం నుంచి 6.35 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కార్పొరేషన్ బ్యాంక్ షేర్ 1.47 శాతం లాభపడి రూ.38 వద్ద ముగిసింది. -
కార్పొరేషన్ బ్యాంక్... వీసా సిగ్నేచర్, ప్లాటినం క్రెడిట్ కార్డులు
హైదరాబాద్: కార్పొరేషన్ బ్యాంక్ తాజాగా వీసా ఇంటర్నేషనల్ సిగ్నేచర్, వీసా ప్లాటినం క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు కలిగిన వారు (స్వయం ఉపాధి కలిగిన వారి ఆదాయం రూ.3 లక్షలు ఉండాలి) ప్లాటినం కార్డుకు, వార్షిక ఆదాయం రూ.10.50 లక్షలు కలిగిన వారు సిగ్నేచర్ కార్డుకు అర్హులని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కార్డుల క్రెడిట్ లిమిట్ రూ.10,000-రూ.10 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. వీటితోపాటు కార్డులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపింది. కార్డుల్లో ఈఎంవీ చిప్ కార్డు ఉందని, ట్రాన్సాక్షన్ సమయంలో ఓటీపీ ప్రొవైడ్ వల్ల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొంది. -
కార్పొరేషన్ బ్యాంక్‌లో కార్ప్‌పేరోల్ ఖాతాలు
బ్యాంక్ సీఎండీ బన్సాల్ వెల్లడి * ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల కోసం.. విజయవాడ: కార్పొరేషన్ బ్యాంక్‌లో కొత్తగా కార్ప్‌పేరోల్ ఖాతాలను ప్రారంభించినట్లు ఆ బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్. బన్సాల్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో రాష్టస్థాయి బ్యాంకు అధికారులతో సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్ప్‌పేరోల్ ఖాతాలను ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టామన్నారు. కార్ప్పేఎలైట్ను రూ. 15వేల నుంచి రూ.75 వేల లోపు జీతం పొందేవారికి, కార్ప్పేడిలైట్ను రూ.75 వేలు, ఆపై జీతం పొందేవారి కోసం ప్రారంభించామన్నారు. కార్ప్పేఎలైట్ ఉద్యోగులు వీసా ప్లాటినం డెబిట్ కార్డుకు అర్హులని ఆయన వివరించారు. ఈ కార్డు వల్ల రోజుకు రూ.1 లక్ష వంతున విత్‌డ్రాలో ఏటీఎం నుంచి పొందవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, నెల్లూరులో రెండు జోన్లు ఉండగా, వచ్చే మార్చికల్లా వైజాగ్‌లో కొత్త జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోవిజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ-లాబీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ-లాబీ కేంద్రంలో కేవలం యంత్రాల ద్వారా ఖాతాదారులు లావాదేవీలన్నీ జరుపుకొనే వీలుంటుందన్నారు. మీడియా సమావేశంలో కార్పొరేషన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ముజ్ మదార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.శివకుమార్ పాల్గొన్నారు. -
కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.90 శాతానికి దిగింది. ఫలితంగా దీనితో అనుసంధానమైన నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల(ఈఎంఐ) భారం కస్టమర్లపై తగ్గనుంది. తాజా రేటు ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానుందని బీఎస్ఈకి బ్యాంక్ తెలిపింది. -
కార్పొరేషన్ బ్యాంక్‌కు మొండి బకాయిల భారం
న్యూఢిల్లీ : కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.231 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.204 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,215 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.5,335 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ.459 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.621 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 5.43 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 3.71 శాతం నుంచి 3.55 శాతానికి తగ్గాయని బ్యాంకు వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కార్పొరేషన్ బ్యాంక్ షేర్ 0.4 శాతం వృద్ధితో రూ.54కు పెరిగింది. -
కొత్తగా 500 శాఖల ఏర్పాటు
దేశీ విస్తరణపై దృష్టి 15% వ్యాపారాభివృద్ధి లక్ష్యం ఏడాది చివర్లో ఎఫ్‌పీఓ కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ ఎస్.ఆర్.బన్సల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేషన్ బ్యాంక్ వ్యవసాయ, ఎమ్ఎస్ఎంఈ, రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రంగాల్లో ఈ ఏడాది 30 శాతంపైగా వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్.బన్సల్ తెలిపారు. రెండు రోజుల నగర పర్యటన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వ్యాపారంలో 15 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. గత ఏడాది కార్పొరేషన్ వ్యాపార పరిమాణం రూ.3.30 లక్షల కోట్లు దాటింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 500 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్యను 2,500కి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్, హాంకాంగ్‌లో ఉన్న రిప్రజెంటేటివ్ ఆఫీసులను పూర్తి శాఖలుగా మార్చడంతో పాటు మరో రెండు దేశాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి వారం రోజుల్లో ఆర్బీఐని కలుస్తున్నట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం వ్యాపార విస్తరణకు నిధులు అవసరం లేదని, మార్కెట్ పరిస్థితులు బాగుంటే ఏడాది చివర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. -
కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ మృతి
నగరం(మామిడికుదురు), న్యూస్‌లైన్ : నగరం కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ ఎస్.శుభాకర్(54) గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరులోని మల్లికార్జున కాలనీకి చెందిన ఆయన మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. బ్యాంకు స్థానిక కార్యాలయం పక్కనే అద్దెఇంట్లో ఒంటరిగా నివాసముంటున్నారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో పనిమనిషి, కారుడ్రైవర్ ఇంటి కిటికీలోంచి లోపలకు చూశారు. శుభాకర్ లోపల వెల్లకిలా పడిపోయి ఉన్నారు. పోలీసులకు, 108కు సమాచారం అందించి స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. శుభాకర్‌ను స్థానిక పీహెచ్సీ వైద్యుడు కాశిన ప్రభాకర్ పరీక్షించి చాలాసేపటి క్రితమే మృతి చెందినట్టు నిర్ధారించారు. తరచూ అనారోగ్యంతో బాధపడే శుభాకర్ గుండెపోటుతో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. నగరం ఎస్సై డి.విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమాచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. శుభాకర్ మృతికి సంతాపంగా గురువారం కార్పొరేషన్ బ్యాంకును మూసివేశారు. -
ఆగంతకుడి ఆచూకేదీ?
-
ఆగంతకుడి ఆచూకేదీ?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్‌పై వేట కత్తితో దాడి జరిగి ఎనిమిది రోజులైనా ఆగంతకుని ఆచూకీ ఏమాత్రం లభ్యం కాలేదు. అనంతపురం జిల్లా కదిరి ఏటీఎం కేంద్రంలో అచ్చు ఇలాంటి పోలికలే ఉన్న ఆగంతకుడు సీసీ టీవీ కెమెరా దృశ్యాల్లో కనిపించినా, కేసు దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. సుమారు 200 మంది పోలీసులు ఆగంతకుని వేటలో ఉన్నారు. నగర పోలీసులు, అనంతపురం జిల్లా పోలీసులతో కలసి పని చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించడం ద్వారా ఆగంతకుడు పోలీసుల దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాడా... అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బహుశా అతను సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని, బెంగళూరు కూడా అతనికి సుపరిచితమేనని తెలుస్తోంది. జ్యోతిపై దాడి చేయడానికి అర గంట ముందు అతను అక్కడ రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డు లభ్యం జ్యోతి ఉదయ్ ఫోన్‌ను తీసుకు పోయిన ఆగంతకుడు అందులోని సిమ్ కార్డును బీఎంటీసీ బస్సులో పడేశాడు. మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళ్లే బస్సులో రమణ అనే కార్మికునికి సీటు కింద ఈ సిమ్ కార్డు లభించింది. దానిని తన ఫోనులో వాడుకుంటూ అతను పోలీసులకు దొరికి పోయాడు. మారతహళ్లి సమీపంలోని కాడుబీసనహళ్లిలో ఉంటున్న అతనిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్న సిల్వర్ జూబ్లీ పార్కు పోలీసులకు అప్పగించారు. ఈ నెల 19న తాను మెజిస్టిక్ నుంచి మారతహళ్లికి వెళుతుండగా బస్సులో సీటు కింద సిమ్ కార్డు లభ్యమైందని అతను పోలీసులకు చెప్పాడు. దానిని తన ఫోనులో వాడుకుంటున్నానని, అంతకు మించి తనకేమీ తెలియదని వివరించాడు. సోమవారం రాత్రి వరకు పోలీసులు అతనిని ప్రశ్నించారు. అనుమానం కలగక పోవడంతో తర్వాత వదిలి వేశారు. ఏటీఎంలో పని పూర్తి చేసుకున్న అనంతరం కార్పొరేషన్ సర్కిల్ నుంచి ఆగంతకుడు అదే బస్సులో మెజిస్టిక్‌కు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. ఆ సందర్భంలోనే సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసి పారేసి ఉంటాడని పోలీసులు అంచనాకు వచ్చారు. హిందూపురంలో మొబైల్ ఫోను పోలీసులకు లభ్యమైన సంగతి తెలిసిందే. దీంతో మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఆధారంగా చేపట్టిన దర్యాప్తునకు ద్వారాలు మూసుకు పోయాయి. దరిమిలా ఈ కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది. ధర్మవరంలో ఓ మహిళను హత్య చేసిన దుండగుడే బెంగళూరులోనూ ఈ అకృత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణను కొనసాగిస్తున్నారు. కోలుకుంటున్న జ్యోతి ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో జ్యోతి కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కుదుట పడుతోందని, ఒకటి, రెండు రోజుల్లో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే విషయమై యోచిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా జ్యోతి పళ్ల రసం, ఆహారం తీసుకుంటోందని ఆమె భర్త ఉదయ్ కుమార్ తెలిపారు. ఫిజియో థెరపీ కూడా చేయిస్తున్నారని చెప్పారు. ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లిన దుండగుడు పిన్ నంబరును కూడా జ్యోతిని అడిగి తెలుసుకున్నాడా అనే విషయం ఇంకా తెలియలేదన్నారు. ఈ సంఘటనపై ఆమెను ఏమీ అడగవద్దని వైద్యులు సూచించారని తెలిపారు. -
ఏటీఎంల మూత
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకానికి గడువు ముగియడంతో పోలీసులు భద్రత లేని కేంద్రాలను వరుసగా మూసి వేయించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. రాత్రి ఏడు గంటల నుంచి పోలీసులు కార్యాచరణలోకి దిగారు. గార్డులు లేని కేంద్రాలను నిర్దాక్షిణ్యంగా మూసి వేయించారు. ఏటీఎంల వద్ద 24 గంటలూ కాపలా ఉండాలి, లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.... తదితర సుమారు 12 మార్గదర్శకాలను పోలీసులు బ్యాంకులకు సూచించారు. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు అధికారులకు పెద్దగా ఏటీఎంలను మూసివేసిన సంగతి తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం అందుబాటులో ఉన్న బ్యాంకు సిబ్బందికి ఏటీఎంలను మూసి వేయించిన సంగతిని తెలియపరిచారు. గత మంగళవారం బీబీఎంపీ సర్కిల్ వద్ద కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేడు. ఈ సంఘటన అనంతరం ప్రతి ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలే హాంఫట్...: నగరంలో ఈ ఏడాదిలో ఏకంగా మూడు ఏటీఎంలను ఆగంతుకులు పెకిలించుకుని పోయారు. వీటిలో ఒక దానిని మాత్రమే పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. సెక్యూరిటీ గార్డులను హత్య చేసి ఏటీఎంలను దోచుకోవడానికి కూడా జరిగాయి. ఖాతాదారులపై అదనపు భారం : అదనపు భద్రతా సిబ్బంది నియామకం బ్యాంకులకు మరింత భారం కానుంది. నగరంలో ఒక్కో ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీకి రూ.15 వేలు జీతం. అలా మూడు షిఫ్టుల్లో అంటే నెలకు ఒక్కో ఏటీఎంకు రూ.45 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇలా నగరంలో మొత్తం సుమారు 2500 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. వాటి వద్ద భద్రత కోసం ప్రతి నెలా రూ. 11.25 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏటీఎంల వల్ల బ్యాంకులకు 30 శాతం వరకు పని భారం, ఖర్చు తగ్గుతోంది. గార్డులుగా నియమించే మాజీ సైనికులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకుంటే కూడా ఖర్చు ఎక్కువే. ఈసారి బడ్టెట్‌లో భద్రతా సిబ్బంది కోసమే ప్రత్యేక పద్దును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని పలువురు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ భారాన్ని ఇప్పటికిప్పుడే కాకపోయినా భవిష్యత్తులోనైనా ఖాతాదారులపై మోపాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం రాత్రి షిఫ్టుల్లో మాత్రమే గార్డులు ఉండే వారు. ఇప్పుడు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ గార్డులను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖాతాదారుల వద్ద ఏటీఎం చార్జీలుగా రూ.20 (ఆర్థిక), రూ.5 (ఆర్థికేతర) వసూలు చేస్తున్నారు. నగదు విత్‌డ్రాను ఆర్థిక లావాదేవీగా, నిల్వ తనిఖీ, మినీ స్టేట్మెంట్లను ఆర్థికేతర లావాదేవీలుగా పరిగణిస్తున్నారు. కాగా బెంగళూరులో మొత్తం 2580 ఏటీఎం కేంద్రాలు ఉండగా.. అందులో 1137 కేంద్రాలు మూతపడడంతో ఖాతాదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇతర ఏటీఎం కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. కాగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడానికి మరి కొంత గడువు ఇవ్వాలని కోరుతూ పలు బ్యాం కుల ప్రతినిధి బృందాలు నగర పోలీసు కమిషనర్ ఔరాద్కర్‌ను సోమవారం కలిశాయి. అయితే వారి విన్నపాన్ని ఆయన తోసిపుచ్చారు. బ్యాంకు అధికారుల అసహనం : తక్కువ గడువునిచ్చి చెప్పా పెట్టకుండా ఏటీఎం కేంద్రాలను పోలీసులు మూసి వేయించడంపై వివిధ బ్యాంకుఅధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించే పని లో తాము కూడా నిమగ్నమై ఉన్నామని, మధ్య లో శని, ఆదివారాలు రావడంతో కొంత జాప్యం జరిగిందని చెబుతున్నారు. మొత్తానికి దీనిపై స్థానికంగా తాము నిర్ణయాలు తీసుకోలేమని, ఏదైనా ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుందని వివరించారు. -
ఏటీఎంలకు భద్రతపై నేటితో గడువు పూర్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రభుత్వం విధించిన గడువు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. తదుపరి... గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూసి వేయిస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఇదివరకే హెచ్చరించారు. దీంతో బ్యాంకులు యుద్ధప్రాతిపదికన గార్డులను నియమించే పనిలో పడ్డాయి. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే, ఆరు వందల కేంద్రాల్లో గార్డులు లేరు. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎం కేంద్రాల వద్ద రాత్రి పూట మాత్రమే గార్డులను నియమిస్తున్నాయి. ఇక మీదట అలా కాకుండా 24 గంటలూ కాపలా పెట్టాల్సి ఉంది. గత మంగళవారం ఉదయం ఇక్కడి బీబీఎంపీ కార్యాలయం సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు వేట కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఆమె పరిస్థితి మెరుగు పడుతోందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో వైపు ఆగంతకుని కోసం అధికారులు సహా 200 మందికి పైగా సిబ్బంది గాలిస్తున్నారు. ఐదు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. మధ్యలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలి వేస్తున్నారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంతపురం, హిందూపురం పరిసరాల్లోనే పోలీసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. హిందూపురంలోని పలు సర్కిళ్లలో ఆగంతకుని ఫొటో, బహుమతి వివరాలతో కూడిన పోస్టర్లను అంటించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్, కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో కూడా ఇలాంటి పోస్టర్లు వెలిశాయి. ఆంధ్ర సరిహద్దులోని చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు, తుమకూరు జిల్లా మధుగిరిల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారడంతో పాటు... ‘ ప్చ్, ఇన్నాళ్లయినా ఆ దుండగుని పట్టుకోలేదా..’ అనే పెదవి విరుపులు వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆగంతకుని చుట్టు ముట్టామని, ఏ క్షణంలోనైనా పట్టుకుంటామని పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించినందున, ఆగంతకుడు చుట్టు పక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పోలీసుల అదుపులో ఏటీఎం నిందితుడు !
‘సైకో’గా తేల్చిన పోలీసులు.. ఈ నెల 10న ధర్మవరంలో మహిళను హత్యచేసి.. ఏటీఎం కార్డులను అపహరించాడు రెండు చోట్ల ఏటీఎం కేంద్రానికి ఒకేరకం దుస్తులతో వచ్చాడు సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరులోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! దాడిచేసిన వ్యక్తిని సైకో అని పోలీసులు తేల్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ నెల 10న అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మ అనే మహిళపై కూడా అతడు దాడి చేశాడు. ఆమె రెండు ఏటీఎం కార్డులను లాక్కొని పిన్ నంబర్ తెలుసుకున్న తర్వాత హత్య చేశాడు. ఆ రాత్రికే కదిరికి పారిపోయి 11న అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా రూ. నాలుగు వేలు డ్రా చేశాడు. తర్వాత బెంగళూరులో 15న మరో ఏటీఎం కార్డు ద్వారా రూ.18 వేలు డ్రా చేశాడు. అయితే ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎంలను బ్లాక్ చేయించారు. ఆ ఏటీఎం కార్డులు పని చేయకపోవడంతో డబ్బుల కోసం 19న కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఏటీఎం కేంద్రంలోనే దాడి చేసి, ఏటీఎం కార్డును తస్కరించాడు. కదరిలో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ.. బెంగళూరులో జ్యోతి ఉదయ్‌పై దాడి చేసినప్పుడూ సైకో ఒకే విధమైన దుస్తులు ధరించినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డులను పరిశీలిస్తే స్పష్టమైంది. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన అనంతపురం పోలీసులు శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో బెంగళూరు పోలీసులు శనివారం ధర్మవరం చేరుకుని విచారించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని గమనించిన పోలీసులు నిందితుడి వ్యహారశైలిని పరిశీలించాక అతనో సైకోగా తేల్చారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఈ సైకో కూడా ఉన్నట్లు తెలిసింది. -
గార్డులు లేని ఏటీఎంలను మూసేయిస్తాం
= మూడు రోజులు గడువు = బెంగళూరులో 600 కేంద్రాల వద్ద ‘నో సెక్యూరిటీ’ = వాటి వద్ద సర్కార్ భద్రత కల్పించలేదు = ఆ బాధ్యత ఆయా బ్యాంకులదే = ఏ క్షణంలోనైనా ఆగంతుకున్ని పట్టుకుంటాం : హోం మంత్రి వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూయించి వేస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ హెచ్చరించారు. మూడు రోజుల్లోగా అన్ని కేంద్రాల వద్ద గార్డులను నియమించాలని బ్యాంకులకు సూచించారు. ఇక్కడి కార్పొరేషన్ సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు మంగళవారం ఉదయం వేట కత్తితో దాడి చేసిన నేపథ్యంలో బుధవారం జార్జ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే 600 కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని తెలిపారు. అన్ని ఏటీఎంలకు భద్రత కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు కనుక ఆయా బ్యాంకులే బాధ్యత వహించాలని అన్నారు. ఏటీఎంలకు సరైన భద్రత కల్పించే విషయమై సూచనలు చేయడానికి హోం శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏటీఎంల వద్ద భద్రత ఉందో, లేదో పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఆగంతుకున్ని పట్టుకుంటాం ఏటీఎం కేంద్రంలో జ్యోతిపై దాడి చేసిన ఆగంతకుని ఆచూకీ తెలిసిందని, ఏ క్షణంలోనైనా అతనిని పట్టుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. ఇప్పటికే అతని కోసం గాలించడానికి తన నాయకత్వంలో ఎనిమిది బృందాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు జరుగుతోందన్నారు. సీసీ టీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆగంతకుని ఆనవాళ్ల గురించి పోలీసులకు కొన్ని క్లూలు లభించాయన్నారు. అతను కన్నడంలో మాట్లాడినందున ఎప్పటి నుంచో రాష్ట్రంలో ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. కోలుకుంటున్న జ్యోతి దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికి మంగళవారం రాత్రి మేజర్ న్యూరోసర్జికల్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మెదడులోకి చొచ్చుకు పోయిన పుర్రె ఎముకను తొలగించామని పేర్కొంది. దెబ్బ తిన్న మెదడు పొరలను సరి చేసినట్లు వెల్లడించింది. విరిగిన పుర్రె ఎముకలను కూడా తిరిగి అతికించినట్లు తెలిపింది. ప్లాస్టిక్ సర్జికల్ బృందం ముక్కు, ముఖంపై ఏర్పడిన గాయాలకు చికిత్సలు చేసిందని వివరించింది. పేషెంట్ సృ్పహలో ఉందని, మాట్లాడుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆమె న్యూరో ఇంటెన్సిన్ కేర్ యూనిట్లో ఉన్నారని, అనుక్షణం ఆమెను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. రక్తం ఎక్కించామని, ప్రస్తుతం మెడికల్ మేనేజ్మెంట్లో ఉందని పేర్కొంది. చీఫ్ న్యూరో సర్జన్, ఆస్పత్రి ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్కే. వెంకట రమణ ఈ ప్రకటనను విడుదల చేశారు. కాగా హోం మంత్రితో పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, నగర పోలీసు కమినర్ ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆమెకు ఏదైనా సాయం అందించగలమేమో...పరిశీలిస్తామని జార్జ్ తెలిపారు. -
కార్పొరేషన్ బ్యాంక్ రుణరేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ గృహ, ఆటో. వినియోగ వస్తువులపై రుణ రేట్లను 1.75 శాతం వరకూ తగ్గించింది. పండుగ సీజన్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గృహ రుణాలపై వడ్డీ రేటును అరశాతం, ఆటో రుణాలపై రేటును ఒకశాతం తగ్గిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక వినియోగ వస్తువుల రుణాలకు సంబంధించి వడ్డీరేటును రూ. 5 లక్షల వరకూ 1.75 శాతం తగ్గించింది. గృహ రుణాలపై ఇలా : గృహ రుణాలకు సంబంధించి రూ.50 లక్షల వరకూ అన్ని రుణాలపై రేటు 10.25 బేస్రేట్కు సమానంగా ఉంటుంది. రూ.50 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.50 శాతం. రూ. 25 లక్షల వరకూ రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను పూర్తిగా మినహాయించారు. ఆపై మొత్తాలపై ఈ ఛార్జీలలో 50 శాతం వరకూ రాయితీ ఇస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. వాహన, గృహోపకరణాలు రుణాలు: వాహన రుణాల విషయంలో రూ. 50 లక్షల వరకూ రుణాలపై రేటు 10.65 శాతం. ఇందుకు వర్తించే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ. అలాగే కిచెన్, గృహోపకరణాలు, సోలార్ ప్యానల్స్, వాటర్ హీటర్లపై రుణ రేట్లను 12.25 శాతం నుంచి 10.50 శాతానికి బ్యాంక్ తగ్గించింది. 2014 జనవరి వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కాగా ఆకర్షణీయమైన ప్రీమియంకు వాహన బీమా కవరేజ్ ఆఫర్ చేయడానికి న్యూ ఇండియా ఎస్యూరెన్స్తో బ్యాంక్ ప్రత్యేక ఏర్పాటు కూడా చేసుకుంది. పండుగసీజన్‌లో డిమాండ్ పెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పలు బ్యాంకులు ఇప్పటికే వివిధ విభాగాలపై వడ్డీరేట్లు తగ్గించాయి.