కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ మృతి
Published Fri, Jan 24 2014 1:12 AM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM
నగరం(మామిడికుదురు), న్యూస్‌లైన్ : నగరం కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ ఎస్.శుభాకర్(54) గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరులోని మల్లికార్జున కాలనీకి చెందిన ఆయన మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. బ్యాంకు స్థానిక కార్యాలయం పక్కనే అద్దెఇంట్లో ఒంటరిగా నివాసముంటున్నారు. గురువారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో పనిమనిషి, కారుడ్రైవర్ ఇంటి కిటికీలోంచి లోపలకు చూశారు. శుభాకర్ లోపల వెల్లకిలా పడిపోయి ఉన్నారు. పోలీసులకు, 108కు సమాచారం అందించి స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. శుభాకర్‌ను స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు కాశిన ప్రభాకర్ పరీక్షించి చాలాసేపటి క్రితమే మృతి చెందినట్టు నిర్ధారించారు. తరచూ అనారోగ్యంతో బాధపడే శుభాకర్ గుండెపోటుతో మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. నగరం ఎస్సై డి.విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమాచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. శుభాకర్ మృతికి సంతాపంగా గురువారం కార్పొరేషన్ బ్యాంకును మూసివేశారు.
Advertisement
Advertisement