
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా పి.వి.భారతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1, ఆ తర్వాత ఆమె నూతన బాధ్యతలు స్వీకరిస్తారని, 2020 మార్చి 31 వరకు కార్పొరేషన్ బ్యాంకు ఎండీ, సీఈవో బాధ్యతల్లో ఉంటారని కేంద్రం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక, కార్పొరేషన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బిరూపాక్ష మిశ్రా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాలకృష్ణ ఆల్సేను నియమిస్తున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ మరో ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం మిశ్రా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండి యా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ కార్పొరేషన్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఇక కార్పొరేషన్ బ్యాంకు మరో జన రల్ మేనేజర్ కె.రామచంద్రన్‌ను అలహాబాద్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment