
డిఫాల్టర్ల ఇళ్ల ఎదుట మౌన ప్రదర్శనలు
బాకీల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నిర్ణయం
హైదరాబాద్: రుణ బకాయిల వసూళ్లకు కార్పొరేషన్ బ్యాంకు నూతన మార్గాన్ని ఎంచుకుంది. బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారుల ఇళ్లు, కంపెనీల కార్యాలయాల ముందు బ్యాంకు ఉద్యోగులు ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. రుణ చెల్లింపుల దిశగా వారిపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు, విఫలమైతే ఎదురయ్యే పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.