
కార్పొరేషన్ బ్యాంక్... వీసా సిగ్నేచర్, ప్లాటినం క్రెడిట్ కార్డులు
హైదరాబాద్: కార్పొరేషన్ బ్యాంక్ తాజాగా వీసా ఇంటర్నేషనల్ సిగ్నేచర్, వీసా ప్లాటినం క్రెడిట్ కార్డులను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు కలిగిన వారు (స్వయం ఉపాధి కలిగిన వారి ఆదాయం రూ.3 లక్షలు ఉండాలి) ప్లాటినం కార్డుకు, వార్షిక ఆదాయం రూ.10.50 లక్షలు కలిగిన వారు సిగ్నేచర్ కార్డుకు అర్హులని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. కార్డుల క్రెడిట్ లిమిట్ రూ.10,000-రూ.10 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. వీటితోపాటు కార్డులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపింది. కార్డుల్లో ఈఎంవీ చిప్ కార్డు ఉందని, ట్రాన్సాక్షన్ సమయంలో ఓటీపీ ప్రొవైడ్ వల్ల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొంది.