కార్పొరేషన్ బ్యాంక్ బాధితులకు వారంలో న్యాయం
Published Fri, Oct 7 2016 1:57 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
ఆకివీడు : స్థానిక కార్పొరేషన్ బ్యాంక్‌లో బంగారు ఆభరణాలు, దస్తావేజులు మాయమైన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని డీజీపీ ఎన్.సాంబశివరావు పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆకివీడు పోలీస్ స్టేషన్‌ను గురువారం సందర్శించిన డీజీపీని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య, బాధితులు కలిశారు. ఎంపీ గంగరాజు కూడా బాధితులకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు. దీనిపై స్పందించిన డీజీపీ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు కేసును అప్పగించారు. వారంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చర్చి వివాదం పరిష్కరించాలి
స్థానిక సీబీసీఎన్‌సీ బాప్టిస్ట్ చర్చి వివాదాన్ని పరిష్కరించాలని డీఎస్పీ పూర్ణచంద్రరావును డీజీపీ ఆదేశించారు. చర్చి ఆస్తులను అమ్మేసుకున్నారని చర్చికి చెందిన కొంత మంది పెద్దలు డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన కేసు వివరాలను ఎస్సై అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ కేసును త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ డీఎస్పీని ఆదేశించారు.
Advertisement
Advertisement