82 శాతం తగ్గిన కార్పొరేషన్ బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: .కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 82 శాతం పడిపోయింది. 2015 ఇదే కాలంలో రూ.204.2 కోట్లుగా ఉన్న లాభం, తాజా సమీక్షా కాలంలో రూ.53.3 కోట్లకు తగ్గింది. మొండిబకాయిలకు సంబంధించి అధిక ప్రొవిజనింగ్ కేటాయింపులు దీనికి ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. కాగా ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,335 కోట్ల నుంచి రూ.5,241 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ తదితర కేటాయింపులు రూ.621 కోట్ల నుంచి రూ.895 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల రుణాల్లో స్థూల మొండిబకాయిలు 5.43 శాతం నుంచి 11.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏల విషయంలో ఈ శాతం 3.55 శాతం నుంచి 7.22 శాతానికి పెరిగింది.