
ఆకివీడు కార్పొరేషన్ బ్యాంక్‌లో మేనేజర్‌తో చర్చిస్తున్న బంగారు ఆభరణాల బాధితులు
ఆకివీడు: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వకుండా నోటీసులు జారీ చేయడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితం కా ర్పొరేషన్ బ్యాంక్ ఆకివీడు శాఖలో బం గారు ఆభరణాలు మాయమైన విష యం విదితమే. బ్యాంక్ మేనేజర్, అప్రయిజర్ కలిసి బంగారు ఆభరణాలను కాజేశారంటూ అప్పట్లో బాధితులు రెండు నెలలకు పైగా ఆందోళనలు చేశా రు. బ్యాంకు డీజీఎం స్థాయి అధికారులు వచ్చి బంగారు ఆభరణాలకు సొమ్ములు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఏడాది తర్వాత బాధితులకు రూ.47 లక్షల మేర చెల్లించారు. దీనిపై కేసు నమోదు చేయడంతో మాయం చేసిన సొత్తులో కరిగిం చని ఆభరణాల్ని, కరిగించిన బంగారు ముద్దను కోర్టుకు సమర్పించారు.
కోర్టులో ఉన్న విషయాన్ని పట్టించుకోని బ్యాంకు అధికారులు కరిగించిన ఆభరణాలకు చెందిన బాధితులకు నగదు చెల్లించారని, తమ ఆభరణాలకు కూడా నగదు చెల్లించాలని లేకుంటే ఆభరణాలు ఇవ్వాలని మిగిలిన ఖాతాదారులు మొత్తుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని బాధితులు బుధవారం బ్యాంకు మేనేజర్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తమ ఆభరణాలు ఇవ్వకుండా నోటీసులు జారీ చేసి బాకీ చెల్లించమని ఒత్తిడి చేయడం దారుణమని బాధితులు బ్యాంకు ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఆవేదన వెళ్లగక్కారు. నోటీసును ఉపసంహరించుకుని రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని డీజీఎం హామీ ఇచ్చారని వినియోగదారుల రక్షణ మండలి రాష్ట్ర సభ్యుడు బొబ్బిలి బంగారయ్య విలేకరులకు తెలి పారు. బాకీ మొత్తం చెల్లించిన బాధితులకు ఆభరణాలు ఇవ్వమంటే కోర్టులో ఉన్నాయని చెబుతున్నారని, కొద్దిమొత్తం బకాయి ఉన్న వ్యక్తులకు బకాయి క ట్టమని నోటీసులు జారీ చేయడం స మంజసం కాదన్నారు. 48 గంటల్లో స మస్య పరిష్కరించకపోతే బ్యాంక్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బాధితులు నంద్యాల సీతారా మయ్య, కందుల సత్యనారాయణ, అ ప్పారావు, శిరిగినీడి భాస్కరరావు, బ చ్చు కృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment