
కార్పొరేషన్ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 10 శాతం నుంచి 9.90 శాతానికి దిగింది. ఫలితంగా దీనితో అనుసంధానమైన నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల(ఈఎంఐ) భారం కస్టమర్లపై తగ్గనుంది. తాజా రేటు ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానుందని బీఎస్‌ఈకి బ్యాంక్ తెలిపింది.