స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు | Nifty off days high, Midcap outperforms; ICICI Bank falls | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు

Published Sat, Oct 29 2016 12:26 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM

స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు - Sakshi

స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ మరోదఫా రుణ రేటును స్వల్పంగా 0.10%  తగ్గించింది. దీనితో ఓవర్‌నైట్‌కు సంబంధించి రేటు 8.75 శాతానికి పడింది. మూడు నెలల కాలానికి 8.85 శాతానికి తగ్గుతుంది. ఏడాది కాలానికి 8.95 శాతానికి దిగివస్తుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత ఈ రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) నవంబర్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. 

అక్టోబర్ 4వ తేదీన ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.25 శాతం)ను పావుశాతం తగ్గించిన వెంటనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించిన మొట్టమొదటి బ్యాంకుగా ఐసీఐసీఐ నిలిచింది. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత వార్షిక రుణ రేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనికి తాజా తగ్గింపు అదనం.

కార్పొరేషన్ బ్యాంక్ కూడా...
ఇదిలావుండగా,  ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్ కూడా రుణ రేటును 0.05 శాతం తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement