న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి వారిని ముందుగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రశ్నించారు. అయితే, వారు విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
చందా కొచర్, దీపక్ కొచర్‌లను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. తొలి చార్జి షీటును కూడా సీబీఐ సత్వరం దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2012లో చందా కొచర్ సీఈవోగా ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు, ప్రతిగా ఆ కంపెనీ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచర్‌కి చెందిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో చందా కొచర్, దీపక్ కొచర్, ధూత్‌లతో పాటు న్యూపవర్ రెన్యువబుల్స్ తదితర సంస్థలను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్!
Comments
Please login to add a commentAdd a comment