సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన వినియోగదారులకు మరోసారి భారీ షాకిచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్)ను 20 బీపీఎస్ పాయింట్లు పెంచింది. పెంచిన రేట్లు నేటి( జూలై 1, 2022) నుంచే అమల్లోకి వచ్చాయి.
రుణాలపై వడ్డీ రేట్ల తాజా సవరణతో మూడు నెలల లోపు రుణాలపై వడ్డీరేటు 7.55 శాతం, ఆరు నెలల 7.70 శాతం, వార్షిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. అన్ని కాల వ్యవధి రుణాలపై ఈ పెంపు వర్తిస్తుంది. గత నెలలోనే (జూన్ 1) రుణాలపై వడ్డీరేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment