
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో లాభాలతో రికార్డును నమోదు చేసినప్పటికీ భారీ అమ్మకాలతో భారీ పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 360 పాయింట్లు పతనమై 33,370 వద్ద, నిఫ్టీ 102పాయింట్లు క్షీణించి 10,350 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ 10,400కి దిగువకు చేరింది. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల్లోనూ నష్టాలే. ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సెక్టార్‌లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి.
అమెరికా మార్కెట్ రెగ్యులేటరీ వార్నింగ్ లెటర్‌తో లుపిన్ టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు సిప్లా, సన్ ఫార్మా, దివీస్, గ్లెన్‌మార్క్, అరబిందో, పిరమల్, కేడిలా, గ్లాక్సో, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి.
అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో యూనియన్, పీఎన్‌బీ, ఓబీసీ, బ్యాంక్ ఆప్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్, అలహాబాద్, కెనరా బ్యాంక్, బీవోబీ, ఎస్‌బీఐ, ఐడీబీఐతోపాటు , కాంకర్, బీహెచ్‌ఈఎల్, జస్ట్ డయల్, భారతి ఎయిర్ టెల్,ఓన్‌జీసీ, టాటాస్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కాగా ఎన్‌బీసీసీ, హెసీఎల్, టెక్, ఒరాకిల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, గోద్రెజ్ కన్జ్యూమర్, ఇన్ఫో ఎడ్జ్ లాభాల్లోముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment