సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల సెగ కొనసాగుతోంది. దీంతో ఆరంభ నష్టాలనుంచి సూచీలు మరింద కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 370కి పైగా పాయింట్లు పతనమైంది. అటు నిఫ్టీకూడా 11750 స్థాయిదిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 360 పాయింట్లు క్షీణించి 39,241 వద్ద నిఫ్టీ సైతం 91 పాయింట్లునష్టపోయి 11,741 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ వడ్డీ తగ్గింపు అంచనాలతో గురువారం అమెరికన్ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ.. ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ట్రేడర్లు చేపడుతున్న లావాదేవీలు మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వారాంతంలో షార్ట్‌కవరింగ్ లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.
ప్రధానంగా ఫార్మా, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, ఐటీ నష్టపోతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్ లాభపడుతోంది. యస్ బ్యాంక్ 5 శాతం పతనంకాగా, మారుతీ, ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు యూపీఎల్ 4 శాతం ఎగిసింది. హిందాల్కో, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, బ్రిటానియా, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్, ఐబీ హౌసింగ్ లాభపడుతున్న వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment