సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ పతనంనుంచి ఎక్కడా కోలుకున్న లక్షణాలు కనిపించ లేదు. సెన్సెక్స్ దాదాపు 300పాయింట్లు పతనమై 35వేల కిందికి దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 218 పాయింట్లు క్షీణించి 34,950 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,491వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఓఎన్‌జీసీ, గెయిల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా ఎంఆర్‌పిఎల్ ఇలా అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఐటీసీ, బజాజ్ ఆటో, అదానీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎస్‌బ్యాంకు, టాటా స్టీల్, హీరో మోటో, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్‌టెల్ లాభపడుతున్నాయి.
ఆర్‌బీఐ పాలసీ రివ్యూపై ఇన్వెస్టర్లు ప్రధానంగా వేచి చూస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో నిన్నటి ముగింపుతో పోలిస్తే శుక్రవారం రూపాయి 22 పైసలు నష్టపోయి 73.56 వద్ద వుంది.
Comments
Please login to add a commentAdd a comment