సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఆ తరువాత మరింత కుదేలయ్యాయి. దీంతో సెన్సెక్స్ 34వేల కిందికి దిగజారింది. అటు నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 10200కి దిగువకు చేరింది. వరుసగా రెండో రోజు కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీగా ఉండడంతో సెన్సెక్స్ ప్రస్తుతం దాదాపు 400 పాయింట్లు కుప్పకూలి 33,743 వద్ద నిఫ్టీ 105 పాయింట్లు క్షీణించి 10,105 వద్ద కొనసాగుతున్నాయి.
ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాలూ వెనుకంజలోనే ఉన్నాయి. ప్రధానంగా ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ నష్టపోతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బీపీసీఎల్, విప్రో, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, అల్ట్రాటెక్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఇన్‌ఫ్రాటెల్ నష్టపోతుండగా, ఐబీ హౌసింగ్ హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్, కోల్ ఇండియా, టైటన్, హిందాల్కో, ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్ లాభపడుతున్నాయి. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment