'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు' | Don't desire it right now, Kylie Jenner on plastic surgery | Sakshi
Sakshi News home page

'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'

Published Thu, Jan 8 2015 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'

'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'

లాస్ ఏంజిల్స్ : తాను మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని రియాల్టీ స్టార్ కెల్లీ జెన్నర్ స్పష్టం చేసింది.  జెన్నర్ తన  పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లే మరింత నాజూకుగా కనబడుతుందన్న రూమర్లను ఆమె ఖండించింది.  వచ్చే నెలలో ఓ మ్యాగ్ జైన్ కవర్ పేజీకి ఫోజిచ్చే భాగంలో పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్లు వ్యాపించాయి. వాటిపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం నాకు ఆ కోరిక లేదు. తన పెదాలు పెద్దవిగా కనిపిస్తున్నా మేకప్ తో నే కవర్ చేస్తున్నా.  ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత అయితే ఇంకా రాలేదు' అంటూ ఈ 17 ఏళ్ల భామ మురిపెంగా రాగాలు తీస్తోంది. 

 

తన ముఖ కవలికల్లో చోటు చేసుకున్న ఆకస్మిక మార్పులే  ఆ రూమర్లకు కారణమైన ఉండవచ్చన్న జెన్నర్..  తన ఆకారాన్ని కాపాడుకోవడంతో పాటు మేకప్ అనేది ఎలా వేసుకోవాలో బాగా తెలియడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement