Reality TV star
-
విజయాలు.. వివాదాలతో సహజీవనం!
‘కఠిన కాలాన్ని ఎదుర్కోవడం అద్భుతమైన అనుభవం. జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభవం పొందాలి’– అమెరికా 45వ అధ్యక్షుడైన డొనాల్డ్ జాన్ ట్రంప్‌నకు ఇష్టమైన సొంత కొటేషన్ ఇది. ట్రంప్ జీవితాన్ని కొంతవరకు ఈ కొటేషన్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్ జీవితంలో విజయాలు, వైఫల్యాలు, వివాదాలు.. ప్రశంసలు, విమర్శలు.. అవహేళనలు, ఆత్మీయతలు.. అన్నీ కనిపిస్తాయి. అదీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటినీ ఆయన ఒక్కలాగే తీసుకోవడం కూడా కనిపిస్తుంది. ‘డబ్బు కోసం నేను పనిచేయడం లేదు. నా దగ్గర కావల్సినంత డబ్బు ఉంది. అవసరమైన దానికన్నా ఎక్కువే ఉంది. పని చేయడం కోసమే పని చేస్తున్నాను. వ్యాపారం నా కళాత్మక విధానం’ అంటారు ట్రంప్. తండ్రి ఫేమస్ రియల్టర్ డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడెరిక్ ట్రంప్, మేరీ మెక్లియడ్ దంపతులకు 1946 జూన్ 14 వ తేదీన జన్మించారు. ఫ్రెడెరిక్ ట్రంప్ క్వీన్స్‌లో పేరెన్నిక గన్న బిల్డర్, రియల్టర్. క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్, బ్రూక్లిన్ల్లో మధ్యతరగతి వాసులకు చవకగా అపార్ట్మెంట్స్ నిర్మించి ఇచ్చేవాడు. మేరీ కుటుంబం స్కాట్లాండ్ నుంచి వలస వచ్చింది. ఫ్రెడ్, మేరీల వివాహం 1936లో జరిగింది. వారి ఐదుగురు పిల్లల్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగవ వాడు. ఫోర్డమ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, న్యూయార్క్ మిలటరీ అకాడమీల్లో ట్రంప్ విద్యనభ్యసించారు. మిలటరీ అకాడెమీలో స్టార్ అథ్లెట్‌గా, విద్యార్థి నాయకుడిగా ట్రంప్ నిలిచారు. ఆ తరువాత తన తండ్రి వారసత్వంగా రియల్టీ బిజినెస్‌లోకి దిగారు. కొద్ది కాలంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మన్‌హటన్‌లో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారు. 1980లో న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘గ్రాండ్ హయత్ న్యూయార్క్’ ప్రాజెక్టు ఆయనకు డెవలపర్‌గా గొప్ప పేరు తీసుకువచ్చింది. రియాలిటీ టీవీ స్టార్ గానూ ట్రంప్ ప్రఖ్యాతి గాంచారు. ‘ది అప్రెంటిస్’ పేరుతో ఆయన ప్రారంభించిన రియాలిటీ షో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. 2015లో మెజారిటీ ప్రైమరీల్లో, కాకస్‌ల్లో విజయం అనంతరం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2016 ఎన్నికల బరిలో నిలిచి, గెలిచారు. సోదరుడి ప్రభావం మద్యం వ్యసనానికి లోనై చనిపోయిన తన సోదరుడు ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం ట్రంప్ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు. సోదరుడి మరణం తరువాత తాను ఆల్కహాల్ ముట్టనని, డ్రగ్స్ తీసుకోనని ట్రం ప్ శపథం చేశారు. మతపరంగా, ట్రంప్‌ను ఆయన తల్లి ప్రెస్బిటేరియన్‌గా పెంచినప్పటికీ.. తనను తాను మెయిన్‌లైన్ ప్రొటెస్టెంట్నని ఆయన చెప్పుకుంటారు. ట్రంప్ వ్యాపారాల్లో ముఖ్యమైనవి ట్రంప్ ఆర్గనైజేషన్, అట్లాంటిక్‌లో కేసినోలు, టీవీ షోలు. ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ 1987లో టోనీ ష్వాజ్తో కలిసి ట్రంప్ ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం రాశారు. అందులో తన వ్యాపార విజయరహస్యాలను వివరించారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో ఆ పుస్తకం నిలిచింది. కానీ, ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. ‘క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే పుస్తకం కూడా ట్రంప్ రాశారు. 2005లో ఆయన ‘ట్రంప్ యూనివర్సిటీ’ని స్థాపించారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపార మెళకువలను కోర్సులుగా నేర్పించేవారు. ఇవానా.. మేపుల్స్.. మెలానియా ట్రంప్ మొదట 1977లో ఇవానాను వివాహం చేసుకున్నారు. ఇవానా అప్పటికే ప్రముఖ ఫ్యాషన్ మోడల్. వారికి ముగ్గురు పిల్లలు. వారు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. 1992లో ట్రంప్, ఇవానా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత, 1993లో ట్రంప్ మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె నటి. వారికి టిఫానా అనే కూతురు ఉంది. 1999లో మేపుల్స్‌కు 20 లక్షల డాలర్ల పరిహారం చెల్లించి ట్రంప్ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత 2005లో మెలానియాను ట్రంప్ వివాహమాడారు. ఆమె స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్. ట్రంప్ కన్నా వయసులో 23 ఏళ్లు చిన్న. ట్రంప్, మెలానియాల సంతానం బారన్ విలియమ్. డొనాల్డ్ ట్రంప్ పిల్లల్లో డొనాల్డ్ జూనియర్, ఎరిక్‌లు వారి కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ‘ట్రంప్ ఆర్గనైజేషన్’లో వైస్ ప్రెసిడెంట్స్‌గా ఉన్నారు. -
మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం
లండన్: రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ (36) నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల కర్దాషియన్ భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. కర్దాషియన్ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సమర్థించారు. కర్దాషియన్ 2009లో లామర్ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల పాటు వీరి బంధం సవ్యంగా సాగినా ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. లామర్ డ్రగ్స్‌కు బానిస కావడంతో పాటు తనను మోసం చేశాడని కర్దాషియన్ ఆరోపించింది. డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకునేందుకు లామర్‌కు ఆమె సాయం చేసింది. అయితే అతనిలో మార్పు రాకపోవడంతో దూరం కావాలని కర్దాషియన్ నిర్ణయం తీసుకుంది. లామర్ నుంచి విడాకులు తీసుకుంటున్నందుకు ఆమె కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఆమె ఇక నుంచి పూర్తిగా తన కెరీర్‌పై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. -
విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా!
లండన్: తనకు విడాకులపై నమ్మకం లేదని రియాల్టీ టీవీ స్టార్ కోల్ కర్దాషియన్ అంటోంది. గతేదాడి భర్త, బాస్కెట్ బాల్ ప్లేయర్ లామర్ ఓడమ్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడిగా దొరికిపోవడం, వ్యభిచార ముఠా లాంటి కేసులలో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కర్దాషియన్ మాజీ భర్త లామర్ కు ఎంతో అండగా నిలిచింది. భర్త నుంచి విడాకులు తీసుకోవడం, అతడికి దూరంగా ఉండటం లాంటి విషయాలపై తనకు ఏ మాత్రం విశ్వాసం లేదని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎన్నో ఆటుపోటు ఎదురైనా తట్టుకుని నిలిచానని, ఏదో ఓ క్షణంలో వివాహం తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు దూరంగా ఉంటున్నాననిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పేంలేదని వివరణ ఇచ్చుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత 2013లో కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయానని చెప్పింది. ఇన్ని చెప్పినా భర్త లామర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తనకు ఇష్టమంటోంది. దేవుడి ముందు ప్రమాణం చేశానని, అందుకే భర్త నుంచి విడిపోయక కూడా తమ బంధానికి అంత విలువిస్తున్నానని చెప్పింది. తనతో పాటు కుటుంభసభ్యులు కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం ఉంచానని, అదేవిధంగా భర్త లామర్ ను గతంలోనే కాదు భవిష్యత్తులోనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించింది. -
వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత!
లాస్ఏంజిల్స్: హాలీవుడ్ రియాల్టీ స్టార్ ఖోల్ కర్దాషియన్ తనను వదిలేసిన భర్త లామర్ ఒడోమ్ పట్ల ఉదార భావాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు నెలల కిందట లామర్ నెవెడాలోని ఓ బ్రోతల్ హౌస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో అతనికి విడాకులు ఇవ్వాలని ఖోల్ నిర్ణయించింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతూ.. ఈ దంపతులు వేరువేరుగా ఉంటున్న సమయంలో లామర్ గత అక్టోబర్‌లో మద్యం, డ్రగ్స్ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిగా కోలుకోవడంతో అక్కడి నుంచి తరలించి ఓ ప్రైవేటు గృహంలో అతన్ని ఉంచారు. ఈ నేపథ్యంలో తన సొంత ఇంటికి చేరువలో ఉన్న ఓ ఇంటిని లామర్ కోసం ఖోల్ ఇటీవల లీజుకు తీసుకుంది. ఈ ఇంటిలోకి లామర్ను తరలించి ఆలనాపాలనా చూసుకోవాలని ఖోల్ భావిస్తోంది. మాజీ ఎన్బీఏ ఆటగాడైన లామర్ ప్రస్తుతం ఎలాంటి ఆదాయం సంపాదించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతని కోసమే ఖోల్ ఈ ఇంటిని తీసుకుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. లామర్ కోలుకునేలా సపర్యలు చేస్తూ.. శ్రద్ధ తీసుకుంటున్న ఖోల్ అతను ఆప్తమిత్రుడని చెప్తుంది. భర్యాభర్తలిద్దరు మళ్లీ కలిసిపోతారా? అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. తమ పిల్లలకు చేరువగా ఉంటాడనే తన ఇంటికి సమీపంలో అతనికో నివాసాన్ని తీసుకున్నట్టు చెప్తోంది. -
'నా పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు'
లాస్ ఏంజిల్స్ : తాను మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని రియాల్టీ స్టార్ కెల్లీ జెన్నర్ స్పష్టం చేసింది. జెన్నర్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం వల్లే మరింత నాజూకుగా కనబడుతుందన్న రూమర్లను ఆమె ఖండించింది. వచ్చే నెలలో ఓ మ్యాగ్ జైన్ కవర్ పేజీకి ఫోజిచ్చే భాగంలో పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్లు వ్యాపించాయి. వాటిపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం నాకు ఆ కోరిక లేదు. తన పెదాలు పెద్దవిగా కనిపిస్తున్నా మేకప్ తో నే కవర్ చేస్తున్నా. ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత అయితే ఇంకా రాలేదు' అంటూ ఈ 17 ఏళ్ల భామ మురిపెంగా రాగాలు తీస్తోంది. తన ముఖ కవలికల్లో చోటు చేసుకున్న ఆకస్మిక మార్పులే ఆ రూమర్లకు కారణమైన ఉండవచ్చన్న జెన్నర్.. తన ఆకారాన్ని కాపాడుకోవడంతో పాటు మేకప్ అనేది ఎలా వేసుకోవాలో బాగా తెలియడం వల్లే ఇంత అందంగా కనబడుతున్నానని తెలిపింది. -
ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదు..ఒంటరిగానే ఉంటా!
లాస్ ఏంజిల్స్: ఇకపై తనకు ఏ బాయ్ ఫ్రెండ్ అవసరం లేదని.. ఒంటరిగానే ఉంటానని రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయీ కర్దాషియాన్ స్పష్టం చేసింది. బాయ్ ఫ్రెండ్ ఫ్రెంచ్ మోంతానాతో డేటింగ్ చేసిన అనంతరం అతనికి దూరంగా ఉంటున్న ఖ్లోయీ.. తాను ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ ను కోరుకోవటం లేదని తెలిపింది. భర్త లామర్ ఓడమ్ తో విభేదాలు తలెత్తడంతో ఎడబాటుకు గురైన ఖ్లోయీ.. అనుకోని పరిస్థితుల్లో మోంతానాకు దగ్గరయ్యానంటోంది. ఒంటరి జీవితంలో ఎడబాటు కారణంగానే తాను మోంతానాతో డేటింగ్ చేయడానికి ప్రధాన కారణమని పేర్కొంది. ఫ్రెంచ్ మోంతానాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేదంటున్న ఖ్లోయీ. .ఇకపై తాను ఒంటరిగానే ఉంటానని తెలిపింది. ఇదిలా ఉండగా భర్తతో విడాకుల అంశం ఇంకా తుది దశకు రాకపోవడంతో తాను ఇంకా వివాహితనేనని అంటోంది ఈ అమ్మడు.