వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత! | Khloe Kardashian leases neighboring home for Lamar Odom | Sakshi
Sakshi News home page

వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత!

Published Wed, Jan 27 2016 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత!

వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత!

లాస్‌ఏంజిల్స్‌: హాలీవుడ్ రియాల్టీ స్టార్ ఖోల్‌ కర్దాషియన్‌ తనను వదిలేసిన భర్త లామర్‌ ఒడోమ్‌ పట్ల ఉదార భావాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు నెలల కిందట లామర్‌ నెవెడాలోని ఓ బ్రోతల్ హౌస్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో అతనికి విడాకులు ఇవ్వాలని ఖోల్‌ నిర్ణయించింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతూ.. ఈ దంపతులు వేరువేరుగా ఉంటున్న సమయంలో లామర్ గత అక్టోబర్‌లో మద్యం, డ్రగ్స్ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిగా కోలుకోవడంతో అక్కడి నుంచి తరలించి ఓ ప్రైవేటు గృహంలో అతన్ని ఉంచారు. ఈ నేపథ్యంలో తన సొంత ఇంటికి చేరువలో ఉన్న ఓ ఇంటిని లామర్‌ కోసం ఖోల్‌ ఇటీవల లీజుకు తీసుకుంది.

ఈ ఇంటిలోకి లామర్‌ను తరలించి ఆలనాపాలనా చూసుకోవాలని ఖోల్‌ భావిస్తోంది. మాజీ ఎన్‌బీఏ ఆటగాడైన లామర్‌ ప్రస్తుతం ఎలాంటి ఆదాయం సంపాదించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతని కోసమే ఖోల్‌ ఈ ఇంటిని తీసుకుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. లామర్‌ కోలుకునేలా సపర్యలు చేస్తూ.. శ్రద్ధ తీసుకుంటున్న ఖోల్‌ అతను ఆప్తమిత్రుడని చెప్తుంది. భర్యాభర్తలిద్దరు మళ్లీ కలిసిపోతారా? అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. తమ పిల్లలకు చేరువగా ఉంటాడనే తన ఇంటికి సమీపంలో అతనికో నివాసాన్ని తీసుకున్నట్టు చెప్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement