Lamar Odom
-
ఒంటరి జీవితం గడుపుతున్న టీవీ స్టార్
లాస్ ఏంజెలెస్: తానిప్పుడు ఒంటరినని రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ పేర్కొంది. ఒంటరి జీవితం బాగుందని ఆమె తెలిపింది. తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ నుంచి ఆమె విడిపోయింది. కర్దాషియన్ తమ్ముడు రాబ్.. బ్లాక్ చెనాను పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టడంతో ఆమె ఒంటరిదైంది. 'ఒంటరి జీవితం నాకెంతో ఇష్టం. ఎందుకంటే సహజంగా నాది ఒంటరి స్వభావం. నాకు నచ్చినట్టుగా సమయం గడుపుతున్నాను. ఇంతకుముందు నా ఇల్లు చాలా సందడిగా ఉండేది. నా తమ్ముడు వెళ్లిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీగా ఉంది. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను. నాకు నేనుగా బయటకు రావాలని, అందర్నీ కలవాలని అనుకుంటున్నా'నని బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. తన తమ్ముడు దూరమైనందుకు బాధగా ఉందని చెప్పింది. 'రాబ్, నేను కలిసి సినిమాలు, టీవీ చూసేవాళ్లం. కలిసి భోజనం చేసేవాళ్లం. రోజులో జరిగిన విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లం. ఇలాంటివన్నీ కోల్పోయాను. ఒంటరితనాన్ని జయించేందుకు సంగీతం వింటున్నాన'ని కర్దాషియన్ వెల్లడించింది. -
మా అమ్మాయి విడాకులు కోరడం సంతోషం
లండన్: రియాల్టీ టీవీ స్టార్ ఖ్లోయె కర్దాషియన్ తన భర్త, బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు లామర్ ఒడోమ్ (36) నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 31 ఏళ్ల కర్దాషియన్ భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. కర్దాషియన్ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు సమర్థించారు. కర్దాషియన్ 2009లో లామర్ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల పాటు వీరి బంధం సవ్యంగా సాగినా ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. లామర్ డ్రగ్స్‌కు బానిస కావడంతో పాటు తనను మోసం చేశాడని కర్దాషియన్ ఆరోపించింది. డ్రగ్స్ వ్యసనం నుంచి కోలుకునేందుకు లామర్‌కు ఆమె సాయం చేసింది. అయితే అతనిలో మార్పు రాకపోవడంతో దూరం కావాలని కర్దాషియన్ నిర్ణయం తీసుకుంది. లామర్ నుంచి విడాకులు తీసుకుంటున్నందుకు ఆమె కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఆమె ఇక నుంచి పూర్తిగా తన కెరీర్‌పై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. -
విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా!
లండన్: తనకు విడాకులపై నమ్మకం లేదని రియాల్టీ టీవీ స్టార్ కోల్ కర్దాషియన్ అంటోంది. గతేదాడి భర్త, బాస్కెట్ బాల్ ప్లేయర్ లామర్ ఓడమ్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడిగా దొరికిపోవడం, వ్యభిచార ముఠా లాంటి కేసులలో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కర్దాషియన్ మాజీ భర్త లామర్ కు ఎంతో అండగా నిలిచింది. భర్త నుంచి విడాకులు తీసుకోవడం, అతడికి దూరంగా ఉండటం లాంటి విషయాలపై తనకు ఏ మాత్రం విశ్వాసం లేదని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎన్నో ఆటుపోటు ఎదురైనా తట్టుకుని నిలిచానని, ఏదో ఓ క్షణంలో వివాహం తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు దూరంగా ఉంటున్నాననిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పేంలేదని వివరణ ఇచ్చుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత 2013లో కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయానని చెప్పింది. ఇన్ని చెప్పినా భర్త లామర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తనకు ఇష్టమంటోంది. దేవుడి ముందు ప్రమాణం చేశానని, అందుకే భర్త నుంచి విడిపోయక కూడా తమ బంధానికి అంత విలువిస్తున్నానని చెప్పింది. తనతో పాటు కుటుంభసభ్యులు కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం ఉంచానని, అదేవిధంగా భర్త లామర్ ను గతంలోనే కాదు భవిష్యత్తులోనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించింది. -
వదిలేసిన భర్త పట్ల టీవీ నటి ఉదారత!
లాస్ఏంజిల్స్: హాలీవుడ్ రియాల్టీ స్టార్ ఖోల్ కర్దాషియన్ తనను వదిలేసిన భర్త లామర్ ఒడోమ్ పట్ల ఉదార భావాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు నెలల కిందట లామర్ నెవెడాలోని ఓ బ్రోతల్ హౌస్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో అతనికి విడాకులు ఇవ్వాలని ఖోల్ నిర్ణయించింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతూ.. ఈ దంపతులు వేరువేరుగా ఉంటున్న సమయంలో లామర్ గత అక్టోబర్‌లో మద్యం, డ్రగ్స్ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతనికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొద్దిగా కోలుకోవడంతో అక్కడి నుంచి తరలించి ఓ ప్రైవేటు గృహంలో అతన్ని ఉంచారు. ఈ నేపథ్యంలో తన సొంత ఇంటికి చేరువలో ఉన్న ఓ ఇంటిని లామర్ కోసం ఖోల్ ఇటీవల లీజుకు తీసుకుంది. ఈ ఇంటిలోకి లామర్ను తరలించి ఆలనాపాలనా చూసుకోవాలని ఖోల్ భావిస్తోంది. మాజీ ఎన్బీఏ ఆటగాడైన లామర్ ప్రస్తుతం ఎలాంటి ఆదాయం సంపాదించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతని కోసమే ఖోల్ ఈ ఇంటిని తీసుకుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. లామర్ కోలుకునేలా సపర్యలు చేస్తూ.. శ్రద్ధ తీసుకుంటున్న ఖోల్ అతను ఆప్తమిత్రుడని చెప్తుంది. భర్యాభర్తలిద్దరు మళ్లీ కలిసిపోతారా? అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. తమ పిల్లలకు చేరువగా ఉంటాడనే తన ఇంటికి సమీపంలో అతనికో నివాసాన్ని తీసుకున్నట్టు చెప్తోంది.