విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా! | I do not believe in divorce, says Khloe Kardashian | Sakshi
Sakshi News home page

విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా!

Published Thu, May 19 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా!

విడాకులిచ్చినా.. కంటికి రెప్పలా చూసుకుంటా!

లండన్: తనకు విడాకులపై నమ్మకం లేదని రియాల్టీ టీవీ స్టార్ కోల్ కర్దాషియన్ అంటోంది. గతేదాడి భర్త, బాస్కెట్ బాల్ ప్లేయర్ లామర్ ఓడమ్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడిగా దొరికిపోవడం, వ్యభిచార ముఠా లాంటి కేసులలో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కర్దాషియన్ మాజీ భర్త లామర్ కు ఎంతో అండగా నిలిచింది. భర్త నుంచి విడాకులు తీసుకోవడం, అతడికి దూరంగా ఉండటం లాంటి విషయాలపై తనకు ఏ మాత్రం విశ్వాసం లేదని చెప్పుకొచ్చింది.

జీవితంలో ఎన్నో ఆటుపోటు ఎదురైనా తట్టుకుని నిలిచానని, ఏదో ఓ క్షణంలో వివాహం తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడింది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు దూరంగా ఉంటున్నాననిపిస్తే విడాకులు తీసుకోవడంలో తప్పేంలేదని వివరణ ఇచ్చుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత 2013లో కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయానని చెప్పింది. ఇన్ని చెప్పినా భర్త లామర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తనకు ఇష్టమంటోంది. దేవుడి ముందు ప్రమాణం చేశానని, అందుకే భర్త నుంచి విడిపోయక కూడా తమ బంధానికి అంత విలువిస్తున్నానని చెప్పింది. తనతో పాటు కుటుంభసభ్యులు కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడిపై నమ్మకం ఉంచానని, అదేవిధంగా భర్త లామర్ ను గతంలోనే కాదు భవిష్యత్తులోనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement