మాకు పెళ్లి కాలేదు.. నేను ప్రెగ్నెంట్‌ కాదు! | I am not pregnant and I am not married: Kylie Jenner | Sakshi
Sakshi News home page

మాకు పెళ్లి కాలేదు.. నేను ప్రెగ్నెంట్‌ కాదు!

Published Sun, Feb 28 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

మాకు పెళ్లి కాలేదు.. నేను ప్రెగ్నెంట్‌ కాదు!

మాకు పెళ్లి కాలేదు.. నేను ప్రెగ్నెంట్‌ కాదు!

లాస్‌ ఏంజిల్స్‌: హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కైలీ జెన్నర్, ఆమె బోయ్‌ఫ్రెండ్ తైగా మధ్య ఏదో గూడుపుఠాణీ జరిగినట్టు పుకార్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ప్రేమజంట తాజాగా పెళ్లి చేసుకుందని, కైలీ గర్భం కూడా దాల్చిందంటూ ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. దీంతో ఈ జంట ఎక్కడికి వెళ్లినా.. 'ఔనా! మీరు పెళ్లి చేసుకున్నారా? మీకు త్వరలోనే బిడ్డ పుట్టబోతున్నదా' అంటూ విలేకరులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఈ జంట తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా పెళ్లికానీ, నిశ్చితార్థం కానీ చేసుకోలేదని, కైలీ గర్భవతి కాలేదని స్పష్టం చేశారు.

'మీరు గర్భవతా? అని ఎక్కడికెళ్లినా కైలీని అడుతున్నారు. ప్రతిరోజూ ఓ కొత్త కథనం ఈ విషయమై వస్తున్నది. మీకు పెళ్లయిందా? గర్భవతా? అని అడుగుతున్నారు. ఇవన్నీ రూమర్స్‌ మాత్రమే' అని తైగా తాజాగా లైవ్‌లో తెలిపాడు. కైలీ మాట్లాడుతూ 'నేను ప్రెగ్నెంట్‌ను కాదు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయినా పిల్లల కోసం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు' అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement