ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’ | Kylie Jenner Became the Youngest Billionaire in the World | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’  

Published Wed, Mar 6 2019 6:27 PM | Last Updated on Wed, Mar 6 2019 9:01 PM

Kylie Jenner Became the Youngest Billionaire in the World - Sakshi

కైలీ జెన్నర్ (21) అమెరికన్ మోడల్ వేల కోట్ల సంపాదనతో రికార్డుల మోత మోగించింది. ఫోర్బ్స్ తాజా జాబితాలో యంగెస్ట్‌ బిలియనీర్‌గా రికార్డ్‌ కొట్టేసింది. దీంతో అతి చిన్నవయసులోనే వేల కోట్ల సంపాదనకు రాణిగా అమెరికన్ బిజినెస్ ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

21 ఏళ్ళ వయస్సులోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన సంపదను కూడబెట్టిన జెన్నర్  సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్‌గా నిలిచిందని ఫోర్బ్స్‌ పేర్కొంది.  మొత్తం 2153 మంది  జాబితాలో కైలీ 2057వ ర్యాంకు సాధించింది.  కైలీ జెన్నర్ సంపద 900 మిలియన్ డాలర్లు అని లెక్క తేల్చింది ఫోర్బ్స్. ఈ సంపదకు తోడు 10 శాతం మేనేజ్‌మెంట్‌ ఫీజుతో కలిపి ఆమె సంపద బిలియన్ డాలర్ జాబితాలో చేరిందని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది.  ఫేస్‌బుక్‌  అధిపతి మార్క్ జకర్‌బర్గ్‌ 23 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించారని తెలిపింది. అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మొదటి,  రెండుస్థానాల్లో నిలిచారు. 

కైలీ జెన్నర్  2015 మేలో తల్లి నుంచి వారసత్వంగా లభించిన  కాస్మొటిక్‌ బిజినెస్‌లోకి  ప్రవేశించింది. 15వేల లిప్‌ కిట్స్‌ను  పరిచయం చేయగా నిమిషాల్లోనే హాట్‌ కేకుల్లా రికార్డు స్థాయిలో అమ్ముడు బోయాయ. ఇక అప్పటినుంచీ అమ్మకాల్లో సంచనాలను నమోదు చేస్తూనే ఉంది. ఆ తరువాత కైలీ కాస్మొటిక్స్‌ పేరుతో ఫిబ్రవరిలో రీలాంచ్‌ అయిన కంపెనీ  5లక్షల లిప్‌కాట్లను వివిధ షేడ్లలో లాంచ్‌ చేసి కాస్మొటిక్‌ బిజినెస్‌ వర్గాల్లో గుబులు పుట్టించింది.  కేవలం ఒక్క ఏడాదిలోనే  307 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. ఆ తరువాత తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బ్యూటీ సంస్థ  ఉల్టాతో జతకట్టింది.  తద్వారా 360 మిలియన్‌ డాలర్లను సాధించింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బారీ ఫాలోయింగే ఉంది.  ఫ్యాషన్‌  ఐకాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 128 మిలియన్లు, ట్విట్టర్‌లో 26.7 మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. రాపర్‌ ట్రావిస్‌ స్కాట్‌తో రహస్య ప్రేమ, గతేడాది ఫిబ్రవరిలో ఒక బిడ్డకు తల్లి కావడం కూడా  సంచలనమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement