youngest person
-
వావ్! 13 ఏళ్లకే 56 కంపెనీలకు బాస్!మరి ఆదాయం!
న్యూఢిల్లీ: 10వ తరగతి చదువుకునే వయసులోనే డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ వ్యవహరాల్లో ఆరితేరి, పలు కంపెనీల సీఈవోగా వ్యాపారంలో దూసుకుపోతున్నాడంటే నమ్మశక్యంగా లేదు కదా? కానీ బిహార్, ముజఫర్‌పూర్‌కు చెందిన సూర్యాంశ్ కుమార్ అలాంటి అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈవోగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం సూర్యాంశ్ సక్సెస్ స్టోరీ వైరల్‌గా మారింది. మ్యాట్రిమోనీ, డెలివరీ, క్రిప్టోకరెన్సీ సేవల వరకు అన్ని రంగాల్లోనూ ప్రతిభను చాటుకొని, రాణించాలని ప్రయత్ని స్తున్నాడు. ఈ క్రమంలోనే అమ్మ గ్రామానికి చెందిన సూర్యాంశ్ (13) ఇపుడు 56 ఆన్లైన్ కంపెనీలకు సీఈఓగా ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక కంపెనీని లాంచ్ చేయబోతున్నాడట. సూర్యాంశ్ కుమార్ సక్సెస్ జర్నీని ఒకసారి పరిశీలిస్తే తన తొలి కంపెనీని 9వ తరగతిలోనే ప్రారంభించాడు. ఆన్లైన్లో వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు, ఆన్లైన్ కంపెనీని తెరవాలనే ఆలోచన వచ్చిందట సూర్యాంశ్‌కి. వెంటనే ఈ ఆలోచనను తన తండ్రి సంతోష్‌కుమార్‌తో షేర్ చేశాడు. ఈ ఆలోచనను ప్రోత్సహించిన తండ్రి ప్రోత్సహించి మొత్తం ఆలోచనను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చూపించమన్నారు. అలా తొలిగా ఈ-కామర్స్ కంపెనీకి బీజం పడింది. సూర్యాంశ్ తల్లిదండ్రులు, సంతోష్‌కుమార్, అర్చన ఐక్యరాజ్య సమితితో అనుసంధానమైన ఎన్జీవో నడుపుతున్నారు. ఆడుకునే వయసులోనే పలు కంపెనీలకు యజమానిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. తమ బిడ్డ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. Names Of All The Companies That I Am Currently Running..https://t.co/wiNm0zamuv pic.twitter.com/Ciy5vijhd6 — Suryansh (@ceosuryansh) August 3, 2022 కోరుకున్న వస్తువులను కేవలం 30 నిమిషాల్లో ప్రజల ఇళ్లకు డెలివరీ చేయడమే లక్క్ష్యమని సూర్యాంశ్ చెప్పారు. త్వరలో వస్తువుల పంపిణీని ప్రారంభించనుంది. సూర్యాంశ్ మరో సంస్థ షాదీ కీజేయే. ఇది జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ప్రజలకు సహాయం చేస్తుంది. ఇప్పటిదాకా సూర్యాంశ్ కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 56కు పైగా స్టార్టప్ కంపెనీలను నమోదవ్వగా, మరికొన్నిరిజిస్టర్ కావాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పించేలా ‘మంత్రా ఫై’ అనే ఆసక్తికరమైన క్రిప్టో కరెన్సీ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉన్నాడు. చిన్న వయస్సులోనే టెక్నాలజీని అవపోసిన పట్టిన సూర్యాంశ్ రోజుకు 17-18 గంటలు పనిచేస్తాడు. పగలు రాత్రి అటు చదువును, ఇటు వృత్తిని మేనేజ్ చేస్తున్నాడు.ఇ తనికి తల్లిదండ్రుల పప్రోత్సాహం కూడా మూములుదికాదు. పాఠశాల యాజమాన్యం కూడా అతనికి పూర్తి సహాయాన్ని అందిస్తోంది .ప్రస్తుతం ఈ ఆన్లైన్ కంపెనీల ద్వారా సూర్యాంశ్ ఎలాంటి ఆదాయం లేదు.. కానీ భవిష్యత్తులో లక్షల రూపాయలు సంపాదించడం ఖాయమని నమ్ముతున్నాడు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెజవాడ విద్యార్థి
పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ బిష్వరూప్రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు. -
ప్రపంచ కుబేరుల్లో ‘చిన్నది’
కైలీ జెన్నర్ (21) అమెరికన్ మోడల్ వేల కోట్ల సంపాదనతో రికార్డుల మోత మోగించింది. ఫోర్బ్స్ తాజా జాబితాలో యంగెస్ట్ బిలియనీర్‌గా రికార్డ్ కొట్టేసింది. దీంతో అతి చిన్నవయసులోనే వేల కోట్ల సంపాదనకు రాణిగా అమెరికన్ బిజినెస్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. 21 ఏళ్ళ వయస్సులోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన సంపదను కూడబెట్టిన జెన్నర్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా నిలిచిందని ఫోర్బ్స్ పేర్కొంది. మొత్తం 2153 మంది జాబితాలో కైలీ 2057వ ర్యాంకు సాధించింది. కైలీ జెన్నర్ సంపద 900 మిలియన్ డాలర్లు అని లెక్క తేల్చింది ఫోర్బ్స్. ఈ సంపదకు తోడు 10 శాతం మేనేజ్మెంట్ ఫీజుతో కలిపి ఆమె సంపద బిలియన్ డాలర్ జాబితాలో చేరిందని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఫేస్బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్ 23 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించారని తెలిపింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటి, రెండుస్థానాల్లో నిలిచారు. కైలీ జెన్నర్ 2015 మేలో తల్లి నుంచి వారసత్వంగా లభించిన కాస్మొటిక్ బిజినెస్‌లోకి ప్రవేశించింది. 15వేల లిప్ కిట్స్‌ను పరిచయం చేయగా నిమిషాల్లోనే హాట్ కేకుల్లా రికార్డు స్థాయిలో అమ్ముడు బోయాయ. ఇక అప్పటినుంచీ అమ్మకాల్లో సంచనాలను నమోదు చేస్తూనే ఉంది. ఆ తరువాత కైలీ కాస్మొటిక్స్ పేరుతో ఫిబ్రవరిలో రీలాంచ్ అయిన కంపెనీ 5లక్షల లిప్కాట్లను వివిధ షేడ్లలో లాంచ్ చేసి కాస్మొటిక్ బిజినెస్ వర్గాల్లో గుబులు పుట్టించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 307 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ తరువాత తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బ్యూటీ సంస్థ ఉల్టాతో జతకట్టింది. తద్వారా 360 మిలియన్ డాలర్లను సాధించింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బారీ ఫాలోయింగే ఉంది. ఫ్యాషన్ ఐకాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 128 మిలియన్లు, ట్విట్టర్లో 26.7 మిలియన్లమంది ఫాలోయర్లు ఉన్నారు. రాపర్ ట్రావిస్ స్కాట్‌తో రహస్య ప్రేమ, గతేడాది ఫిబ్రవరిలో ఒక బిడ్డకు తల్లి కావడం కూడా సంచలనమే. QUEEN pic.twitter.com/wibRPXxVxo — TRAVIS SCOTT (@trvisXX) March 5, 2019 -
కాంగ్రెస్ అధ్యక్షుడు.. ఆ రికార్డు రాహుల్‌ది కానేకాదు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ పేరిట ఓ రికార్డు నమోదయ్యిందన్న వార్తపై ఎట్టకేలకు స్పష్టత లభించింది. 47 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ చిన్న వయసులో అధ్యక్షుడు అయ్యాడంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రికార్డులను పరిశీలిస్తే.. ఆ రికార్డు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరిట ఉంది. 35 ఏళ్లకే ఆజాద్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1923లో కాకినాడలో నిర్వహించిన సమావేశంలో మహ్మద్ అలీ జవహార్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే అదే ఏడాది ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరిగి ఆజాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 35 ఏళ్లు మాత్రమే. ఆ విషయం రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఇక రాహుల్ కుటుంబంలో కూడా ఆ ఘనత సాధించింది కూడా ఆయన కానేకాదు. 1929 లాహోర్ సమావేశంలో జవహార్‌లాల్ నెహ్రూను అధ్యక్షుడిగా ఎన్నుకోగా.. అప్పటికీ ఆయన వయసు 40 ఏళ్లు. పోనీ స్వాతంత్ర్యం తర్వాత రికార్డు చూసుకున్నా 41 ఏళ్లకే రాజీవ్ గాంధీ (1985లో) ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన్న కాంగ్రెస్ యువ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు మాత్రం రాహుల్ గాంధీకి దక్కకుండా పోయింది. -
చరిత్ర సృష్టించిన మలాలా
లండన్: అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. గతంలో విలియమ్ లారెన్స్ అనే భౌతిక శాస్త్రవేత్త 25 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకుని, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా మలాలా ఈ రికార్డను బద్దలు కొట్టారు. కైలాశ్ సత్యార్థి, మలాలా బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది.