న్యూఢిల్లీ: 10వ తరగతి చదువుకునే వయసులోనే డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ వ్యవహరాల్లో ఆరితేరి, పలు కంపెనీల సీఈవోగా వ్యాపారంలో దూసుకుపోతున్నాడంటే నమ్మశక్యంగా లేదు కదా? కానీ బిహార్, ముజఫర్‌పూర్‌కు చెందిన సూర్యాంశ్ కుమార్ అలాంటి అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచంలోనే యంగెస్ట్ సీఈవోగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం సూర్యాంశ్ సక్సెస్ స్టోరీ వైరల్‌గా మారింది.
మ్యాట్రిమోనీ, డెలివరీ, క్రిప్టోకరెన్సీ సేవల వరకు అన్ని రంగాల్లోనూ ప్రతిభను చాటుకొని, రాణించాలని ప్రయత్ని స్తున్నాడు. ఈ క్రమంలోనే అమ్మ గ్రామానికి చెందిన సూర్యాంశ్ (13) ఇపుడు 56 ఆన్‌లైన్ కంపెనీలకు సీఈఓగా ఉన్నాడు. అంతేకాదు త్వరలోనే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఒక కంపెనీని లాంచ్ చేయబోతున్నాడట.
సూర్యాంశ్ కుమార్ సక్సెస్ జర్నీని ఒకసారి పరిశీలిస్తే తన తొలి కంపెనీని 9వ తరగతిలోనే ప్రారంభించాడు. ఆన్‌లైన్‌లో వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు, ఆన్‌లైన్ కంపెనీని తెరవాలనే ఆలోచన వచ్చిందట సూర్యాంశ్‌కి. వెంటనే ఈ ఆలోచనను తన తండ్రి సంతోష్‌కుమార్‌తో షేర్ చేశాడు. ఈ ఆలోచనను ప్రోత్సహించిన తండ్రి ప్రోత్సహించి మొత్తం ఆలోచనను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చూపించమన్నారు. అలా తొలిగా ఈ-కామర్స్ కంపెనీకి బీజం పడింది.
సూర్యాంశ్ తల్లిదండ్రులు, సంతోష్‌కుమార్, అర్చన ఐక్యరాజ్య సమితితో అనుసంధానమైన ఎన్జీవో నడుపుతున్నారు. ఆడుకునే వయసులోనే పలు కంపెనీలకు యజమానిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. తమ బిడ్డ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Names Of All The Companies That I Am Currently Running..https://t.co/wiNm0zamuv pic.twitter.com/Ciy5vijhd6
— Suryansh (@ceosuryansh) August 3, 2022
కోరుకున్న వస్తువులను కేవలం 30 నిమిషాల్లో ప్రజల ఇళ్లకు డెలివరీ చేయడమే లక్క్ష్యమని సూర్యాంశ్ చెప్పారు. త్వరలో వస్తువుల పంపిణీని ప్రారంభించనుంది. సూర్యాంశ్ మరో సంస్థ షాదీ కీజేయే. ఇది జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో ప్రజలకు సహాయం చేస్తుంది. ఇప్పటిదాకా సూర్యాంశ్ కాంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కింద 56కు పైగా స్టార్టప్ కంపెనీలను నమోదవ్వగా, మరికొన్నిరిజిస్టర్ కావాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పించేలా ‘మంత్రా ఫై’ అనే ఆసక్తికరమైన క్రిప్టో కరెన్సీ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉన్నాడు.
చిన్న వయస్సులోనే టెక్నాలజీని అవపోసిన పట్టిన సూర్యాంశ్ రోజుకు 17-18 గంటలు పనిచేస్తాడు. పగలు రాత్రి అటు చదువును, ఇటు వృత్తిని మేనేజ్ చేస్తున్నాడు.ఇ తనికి తల్లిదండ్రుల పప్రోత్సాహం కూడా మూములుదికాదు. పాఠశాల యాజమాన్యం కూడా అతనికి పూర్తి సహాయాన్ని అందిస్తోంది .ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ కంపెనీల ద్వారా సూర్యాంశ్ ఎలాంటి ఆదాయం లేదు.. కానీ భవిష్యత్తులో లక్షల రూపాయలు సంపాదించడం ఖాయమని నమ్ముతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment