సెన్సేషన్: బాత్రూమ్‌లో సెలబ్రిటీల సెల్ఫీ.. | Kylie Jenner takes celebrities selfie sensation at Met Gala | Sakshi
Sakshi News home page

సెన్సేషన్: బాత్రూమ్‌లో సెలబ్రిటీల సెల్ఫీ..

Published Tue, May 2 2017 2:35 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

Kylie Jenner takes celebrities selfie sensation at Met Gala

వాషింగ్టన్: పలు దేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు మెట్ గాలా ఫ్యాషన్ షోలో విభిన్న ఆహార్యంతో అదరగొట్టినా ప్రస్తుతం ఓ సెల్ఫీ వైరల్‌గా మారింది. అమెరికాలోని న్యూజెర్సీలో 69వ వార్షిక మెట్ గాలా ఫ్యాషన్ షో అట్టహాసంగా నిర్వహించారు. ఆ షో లో సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ తీసిన ఓ సెల్ఫీ వివాదాస్పదంగా మారింది. మెట్ గాలా వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా దాదాపు 20 మంది సెలబ్రిటీలు ఓ బాత్రూమ్‌లోకి వెళ్లగా.. కైలీ తన కెమెరాకు పనిపెబుతూ సెల్ఫీ తీసింది. షో నిర్వాహకులు సెల్ఫీలో ఉన్న సెలబ్రిటీలపై మండిపడుతున్నారు.

మెట్ గాల్ రూల్స్ ప్రకారం సాధారణంగానే సెల్ఫీలు దిగడం నిబంధనలకు విరుద్దం. కానీ కెండల్ జెన్నర్, కిమ్ కర్దాషియన్ , లిలీ అల్‌డ్రిడ్జ్, రాకీ, పబ్ డాడీ, బ్రీ లార్సన్, పారిస్ జాక్సన్, తదితరులు బాత్రూమ్‌లో గుమిగూడగా కైలీ జెన్నర్ సెల్ఫీ తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల వ్యవధిలో 20 లక్షల మంది లైక్ చేయగా, 5.1లక్షల మంది ఈ ఫొటోపై కామెంట్ చేయడం విశేషం. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రాలు పాల్గొని సందడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement