ఇక ఆమె అతడితో ఉండదట! | Tyga 'lied repeatedly' to Kylie Jenner | Sakshi
Sakshi News home page

ఇక ఆమె అతడితో ఉండదట!

Published Sun, May 15 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

ఇక ఆమె అతడితో ఉండదట!

ఇక ఆమె అతడితో ఉండదట!

లాస్ ఎంజెల్స్: ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్(18).. ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాపర్ టిగా విడిపోతున్నట్లు తెలుస్తోంది. అతడు తన గర్ల్ ఫ్రెండ్కు విపరీతంగా అబద్ధాలు చెప్తుండటంతో విసుగు చెందిన ఆమె తనతో కలిసి ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కైలీ గత రెండేళ్లుగా తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన టిగా (26)తో డేటింగ్ చేస్తోంది. కానీ, కొద్ది వారాల కిందటే వారిద్దరి మధ్య అపనమ్మకాలు మొదలయ్యాయట.

బాయ్ ఫ్రెండ్ అబద్ధం చెప్తుండటంతో చిర్రెత్తిపోయిన ఈ అమ్మడు అతడితో బందాన్ని తెగదెంపులు చేసుకోవాలని బలంగా నిర్ణయం తీసుకుందట. 'అతడు ఆమెకు వరుసగా అబద్ధాలు చెప్తున్నాడు. అందుకే ఇక ఆమె ఎంతో కాలం అతడితో సాగబోదు. అమె అతడి మాటలను ఇక నమ్మబోదు. గత కొద్ది నెలలుగా చాలా అంశాలపై వారు గొడవపడుతూనే ఉన్నారు. చివరకు ఆమె విడిపోవాలని నిర్ణయం తీసుకుంది' అని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే, అసలు విషయం మాత్రం అతడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకడం వల్లే కైలీని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆ విషయం తెలిసే ఆమె ఇక అతడితో ఉండకూడదని నిర్ణయించుకుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement