Reality TV personality
-
మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి
'మా ఆయన ధరించే చొక్కాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఆయన లేనప్పుడు చూసి వాటిని దొంగిలించి నేను వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాలు నిజానికి సగం వరకు ఆయనవే' అంటోంది హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ర్యాపర్ కేన్యే వెస్ట్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా పీపుల్ మ్యాగజీన్ తో కిమ్ మాట్లాడుతూ 'వెస్ట్ తో డేటింగ్ చేయడం ప్రారంభించిన నాటినుంచి నా డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రోజువారీగా అతని చొక్కాలు దొంగలించడం నాకు అలవాటైంది. చాలావరకు నేను అతని చొక్కాలు వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాల్లో సగం వరకు అతనివి. సగం నావి ఉంటాయి. బటన్స్ తో కూడిన అతని డెనిమ్ షర్ట్స్ లో నేను బాగుంటాను' అని కిమ్ పేర్కొంది. వెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తనను అబ్బురపరుస్తుందని, అతను ఫ్యాషన్ ప్రపంచంలోని ఎంతోమందిని తనకు పరిచయం చేశాడని తెలిపింది. తన బ్రాండెడ్ దుస్తుల్ని, షూలను మార్చమని వెస్ట్ చెప్పినప్పుడు మాత్రం తనకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చింది. -
ఇక ఆమె అతడితో ఉండదట!
లాస్ ఎంజెల్స్: ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్(18).. ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాపర్ టిగా విడిపోతున్నట్లు తెలుస్తోంది. అతడు తన గర్ల్ ఫ్రెండ్‌కు విపరీతంగా అబద్ధాలు చెప్తుండటంతో విసుగు చెందిన ఆమె తనతో కలిసి ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కైలీ గత రెండేళ్లుగా తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన టిగా (26)తో డేటింగ్ చేస్తోంది. కానీ, కొద్ది వారాల కిందటే వారిద్దరి మధ్య అపనమ్మకాలు మొదలయ్యాయట. బాయ్ ఫ్రెండ్ అబద్ధం చెప్తుండటంతో చిర్రెత్తిపోయిన ఈ అమ్మడు అతడితో బందాన్ని తెగదెంపులు చేసుకోవాలని బలంగా నిర్ణయం తీసుకుందట. 'అతడు ఆమెకు వరుసగా అబద్ధాలు చెప్తున్నాడు. అందుకే ఇక ఆమె ఎంతో కాలం అతడితో సాగబోదు. అమె అతడి మాటలను ఇక నమ్మబోదు. గత కొద్ది నెలలుగా చాలా అంశాలపై వారు గొడవపడుతూనే ఉన్నారు. చివరకు ఆమె విడిపోవాలని నిర్ణయం తీసుకుంది' అని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే, అసలు విషయం మాత్రం అతడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకడం వల్లే కైలీని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆ విషయం తెలిసే ఆమె ఇక అతడితో ఉండకూడదని నిర్ణయించుకుందట.