మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి | I steal Kanye shirts on daily basis, says Kim Kardashian | Sakshi
Sakshi News home page

మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి

Published Tue, Aug 16 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి

మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి

'మా ఆయన ధరించే చొక్కాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఆయన లేనప్పుడు చూసి వాటిని దొంగిలించి నేను వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాలు నిజానికి సగం వరకు ఆయనవే' అంటోంది హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ర్యాపర్ కేన్యే వెస్ట్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా పీపుల్ మ్యాగజీన్ తో కిమ్ మాట్లాడుతూ 'వెస్ట్ తో డేటింగ్ చేయడం ప్రారంభించిన నాటినుంచి నా డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

రోజువారీగా అతని చొక్కాలు దొంగలించడం నాకు అలవాటైంది. చాలావరకు నేను అతని చొక్కాలు వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాల్లో సగం వరకు అతనివి. సగం నావి ఉంటాయి. బటన్స్ తో కూడిన అతని డెనిమ్ షర్ట్స్ లో నేను బాగుంటాను' అని కిమ్ పేర్కొంది. వెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తనను అబ్బురపరుస్తుందని, అతను ఫ్యాషన్ ప్రపంచంలోని ఎంతోమందిని తనకు పరిచయం చేశాడని తెలిపింది.  తన బ్రాండెడ్ దుస్తుల్ని, షూలను మార్చమని వెస్ట్ చెప్పినప్పుడు మాత్రం తనకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement