కర్ణాటకాలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధంపై వచ్చిన కలహాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతును కోసేశాడు. అనంతరం బాధితుని గొంతు నుంచి రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు నిందితున్ని విజయ్‌గా గుర్తించారు. నిందితుడు మరేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు తగాదా కూడా జరిగింది. ఆ అంశంపై చర్చించడానికి బాధితున్ని విజయ్ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. మరేశ్ గొంతును కత్తిరించాడు. అనంతరం పక్కనే కూర్చుని రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఓ బాటసారి వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కారు పార్క్ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో..
Comments
Please login to add a commentAdd a comment