సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు వచ్చి, అవి గట్టిగా మారడాన్ని ‘ఆర్థరైటిస్’గా వ్యవహరిస్తుంటారు. మామూలుగానైతే పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, పిల్లల్లోనూ కనిపిస్తుంది. ఇటీవల ఈ ధోరణి కాస్త ఎక్కువగానే ఉంది. పదహారేళ్ల లోపు పిల్లల్లో కారణమేమిటో తెలియకుండా వచ్చి, ఎదిగే ఎముకల్ని ప్రభావితం చేసే ఈ ఆర్థరైటిస్‌ను ‘జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్’ అనీ, ‘పీడియాట్రిక్ రుమాటిక్ డిసీజ్’ అని కూడా అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసం...
చిన్నారుల వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత ఎముకల కీళ్ల కణాలను దెబ్బతీయడంతో వస్తుంది కాబట్టి ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ (జేఐఏ)లో అనేక రకాలు ఉండటంవల్ల లక్షణాలూ వేర్వేరుగా ఉంటాయి.
జేఐఏలోని రకాలు:
సిస్టమిక్ ఆన్‌సెట్ జేఐఏ : ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒంటిమీద ర్యాష్‌తో కొన్నిసార్లు గుండె, కాలేయం, స్లీ్పన్, లింఫ్‌నోడ్స్‌ను ప్రభావితం చేయవచ్చు.
ఆలిగో ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆరు నెలల్లో ఇది ఒకటి నుంచి నాలుగు రకాల కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఆర్నెల్లు దాటాక ఇంక ఏ కీలునూ ప్రభావితం చేయక΄ోతే దీన్ని ‘పర్‌సిస్టెంట్’ రకంగా పిలుస్తారు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత మరిన్ని కీళ్లను ప్రభావితం చేస్తే దీన్ని ‘ఎక్స్‌టెండెడ్’ రకంగా చెబుతారు.
లీ ఆర్టిక్యులార్ జేఐఏ : మొదటి ఆర్నెల్లలో ఇది 5 లేదా అంతకంటే ఎక్కువ కీళ్లను ప్రభావితం చేస్తుంది. రుమటాయిడ్ ఫ్యాక్టర్ (ఆర్.ఎఫ్.) అనే రక్తపరీక్ష రిజల్ట్‌లో ఇది ఆర్‌ఎఫ్ పాజిటివ్‌గా లేదా ఆర్‌ఎఫ్ నెగెటివ్‌గా ఇలా ఎలాగైనా కనిపించవచ్చు.
ఎంథసైటిస్ జేఐఏ : ఇందులో చిన్నారికి ఆర్థరైటిస్‌తోపాటు ఎంథసైటిస్ సమస్య కూడా ఉంటుంది. అంటే టెండన్ లేదా లిగమెంట్‌తో ఎముక కలిసే చోట వాపు కనిపిస్తుంది.
సోరియాటిక్ ఆర్థరైటిస్ : ఇందులో ఆర్థరైటిస్‌తోపాటు చర్మవ్యాధి అయిన సోరియాసిస్ కూడా కనిపిస్తుంది లేదా ఆర్థరైటిస్‌తోపాటు చేతి వేలు / కాలి బొటనవేలి ఇన్‌ఫ్లమేసన్ లేదా ఆర్థరైటిస్‌తోపాటు చేతి గోళ్ల మీద చిన్న చిన్న గుంటల్లా / గ్రూవ్స్‌లా రావచ్చు.
చికిత్స: పిల్లల్లో సగం మందికి చికిత్స తర్వాత దాదాపుగా పూర్తిగా కోలుకునే అవకాశాలుంటాయి అయితే రుమటాలజిస్ట్ ఆధ్వర్యంలో నిశితమైన చికిత్స అందించాలి. చికిత్సలో భాగంగా...
నొప్పులూ, వాపు, మంట తగ్గించడానికి నాన్‌స్టెరాయిడల్ యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీ)
జేఐఏను అదుపులో పెట్టడానికి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ మెడిసిన్స్ (డిఎమ్‌ఏఆర్‌డీ)
డాక్టర్ నిర్ణయించిన మోతాదులో కార్టికోస్టెరాయిడ్స్
మిగతా మందులు అంతగా ప్రభావం చూపనప్పుడు‘బయాలజిక్స్’ అనే పేరున్న అధునాతన మందులు.
మందులతోపాటు కండరాలు, కీళ్లను సక్రమంగా పనిచేయించడం కోసం ఫిజియోథెరపీ, మంచి ఆహారం కోసం న్యూట్రిషనల్ కౌన్సెలింగ్, క్రమం తప్పని వ్యాయామాలు, కంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి
లక్షణాలు :
మోకాలు, చేతి /పాదాల, మడమ, భుజాలు, మోచేయి లేదా ఏ ప్రదేశంలోని కీళ్లలో వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళ లేదా నిద్రలేవగానే ఈ కీళ్లవాపు కనిపించవచ్చు
కళ్లు ఎర్రబారడం, మంట, వాపు
కీళ్ల ఎర్రబారడంతోపాటు వేడిగా అనిపించడం
కదలికలకు కీళ్లు సహకరించక΄ోవడం ∙తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ
ఆకలి మందగించడం, బరువు అలాగే ఎత్తు వయసుకు తగినట్లుగా పెరగకపోవడం
లింఫ్‌నోడ్స్ వాపు.
నిర్ధారణ :
యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ (ఏఎన్‌ఏ) పరీక్షతోపాటు ఇతర యాంటీబాడీ పరీక్షలు
కంప్లీట్ బ్లడ్ కౌంట్ ∙ఎరిథ్రోసైటిస్ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్‌ఆర్) పరీక్ష
సీ రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్‌పీ) పరీక్ష ∙క్రియాటినిన్ (కిడ్నీలు సరిగా పనిచేస్తున్నాయా అని తెలిపే పరీక్ష)
హిమాటోక్రిట్ (రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను తెలిపే పరీక్ష. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతతో బాధపడటం ఎక్కువ)
రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష
అలాగే ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, బోన్ స్కాన్ వంటి కొన్ని ఇమేజింగ్ పరీక్షలతోపాటు మూత్ర పరీక్ష, కీళ్లలోని కందెన వంటి ద్రవాన్ని పరీక్షించే ‘ఆర్థ్రోసెంటైసిస్ పరీక్ష...
ఇంకా పూర్తిస్థాయి కంటి పరీక్షలు అవసరం.
-డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్
(చదవండి: అర్లీ మెనోపాజ్ ప్రమాదమా..?)
Comments
Please login to add a commentAdd a comment