
దుర్మార్గులను సన్మార్గంలో పెడతాం..
న్యూఢిల్లీ: నవంబరు 8 పెద్ద నోట్ల రద్దుతరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. సుమారు 42 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో నల్లధనం, అవినీతిపై పోరాటాన్ని కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. దేశ ప్రజలకు కొత్త పథకాలను ప్రకటించారు. సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైంది. అవినీతి దేశానికి చీడలాంటిది. వీటిపై యుద్ధంలో ప్రజలనుంచి అపూర్వ మద్దతు లభించడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. కానీ నల్లకుబేరులకు చెక్ పెట్టే క్రమంలో నిజాయితీపరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. సర్కార్ సజ్జనోంకీ మిత్ర్ హే, దుర్జనోకీ శత్రు హే అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఉగ్రవాదులు, నక్సలైట్లు నల్లధనంపై ఆధారపడి ఉన్నారన్నారు
ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు సంఘ విద్రోహ కారులను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఈ విషయంలో చట్టం తన పని చేసుకుపోతుంది. చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. తప్పు చేసిన వారిని వదిలి పెట్టేప్రసక్తి లేదు. కానీ అమాయకులను రక్షించడంఎలా? అదే ప్రభుత్వ తపన. అమాయకులను ఎలాంటి కష్టం కలగకుండా చూడడమే తమ లక్ష్యం. నిజాయితీ పరులను ఏవిధంగా రక్షించాలనే తమ ఆలోచన. తమ ప్రభుత్వం సజ్జనులకు స్నేహితుడు లాంటిది. అలాగే దుర్జనులను సక్రమమార్గంలో పెట్టుందేకు కృషి చేస్తుంది. టెర్రరిస్టులు, ఆటంకవాదులు, మత్తుమందు వ్యాపారులు, హత్యకారులు అందరూ నల్లధనంపై మాత్రమే ఆధారపడతారు. మనం జాగ్రత్తగా ఉంటే, హింసావాదనుంచి మన పిల్లలను బయట పడే అవకాశం ఉంది. తన ప్రసంగంలో వివిధ వర్గాలకోసం కొన్ని పథకాలను ప్రకటించారు. .