![శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా](/styles/webp/s3/article_images/2017/09/2/71409864168_625x300.jpg.webp?itok=5QtWOGEu)
శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా
- - ‘సాక్షి’తో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా’నని టీటీ డీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టీకరించారు. టీటీడీ ఈవో పోస్టు పొందేందుకు తానెవరి సహాయం కోరలేదని.. కొనసాగేం దుకూ ఎవరి సహాకరం అడగలేదని స్పష్టీకరించారు. గురువారం తిరుపతిలో తన క్యాంప్ ఆఫీసులో ఈవో ఎంజీ గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు.
నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే తనను శ్రీవేంకటేశ్వరస్వామే టీటీడీ ఈవో పదవి ఇచ్చేలా చేశారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నించానన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
తాను ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా.. తెలంగాణలో పెరిగానన్నారు. ఐఏఎస్‌ల విభజనలో కేంద్ర ప్రభుత్వం తనను తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యహరిస్తానని స్పష్టీకరించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు తానెవరి సహాయం కోరలేదన్నారు. శ్రీవారి ఆజ్ఞతో పనిచేస్తానని స్పష్టీకరించారు.