ఆటో డ్రైవర్‌ నిజాయితీ .. | Auto driver returns gold ornament to passenger | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ నిజాయితీ ..

Published Tue, Jul 4 2017 2:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

యజమానులకు నెక్లెస్‌ అందజేస్తున్న పరకాల పోలీసులు, మధ్యలో ఆటోడ్రైవర్‌(పింక్‌ చొక్కా)

యజమానులకు నెక్లెస్‌ అందజేస్తున్న పరకాల పోలీసులు, మధ్యలో ఆటోడ్రైవర్‌(పింక్‌ చొక్కా)

దొరికిన నగల బ్యాగు అప్పగింత
పరకాల: దారిలో తనకు దొరికిన బ్యాగును ఓ ఆటో డ్రైవర్‌ పోలీసులకు అప్పగించి శభాష్‌ అనిపించుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన కొంగొండ సాంబరాజు, అనూష దంపతులు రూ.80 వేల విలువైన నెక్లెస్‌ను బ్యాగులో పెట్టుకొని బైక్‌కు తగిలించారు. మార్గమధ్యలో బ్యాగ్‌ వాహనం నుంచి కిందపడిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగు కనిపించ డం లేదని చూసుకొని లబోదిబోమంటూ పరకాల పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే కనిపర్తి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ తనకు బ్యాగు దొరికిందని ఇందులో విలువైన బంగారు గొలుసు ఉందంటూ పరకాలకు పోలీసులకు అందజేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సీఐ జాన్‌ నర్సింహులు నెక్లెస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్‌ నిజాయితీని మెచ్చుకొని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement