విద్యార్థి నిజాయతీ
Published Thu, Feb 9 2017 11:34 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
– దొరికిన డబ్బు హెచ్‌ఎంకు అందజేత
కోయిలకొండ(కృష్ణగిరి): రహదారిలో పడిపోయిన డబ్బులను నిజాయితీతో హెచ్‌ఎం అందజేసి ఈ విద్యార్థి ఔనత్యాన్ని చాటుకున్న సంఘటన మండల పరిధిలోని కోయిలకొండ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగింది. చిట్యాల గ్రామంలో తాత లాలుస్వామి ఉరుసు సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన రంగవేణి డోన్‌లో సరుకులు తెచ్చుకునేందుకు రూ.7వేలతో ఆటోలో బయలుదేరింది. అయితే మార్గమద్యంలో కోయిలకొండ పాఠశాల సమీపంలో ఆమె డబ్బులు పడిపోయాయి. ఇంతలో పాఠశాల నుంచి పాస్‌కు బయటకు వచ్చిన ఆరో తరగతి విద్యార్థి రమేష్ కంటపడ్డాయి. వెంటనే వాటిని హెచ్‌ఎం చంద్రావతికి అప్పగించారు. డోన్‌లో ఆటో దిగిని తర్వాత డబ్బులు లేకపోవడంతో రంగవేణి తిరిగి రహదారి వెంట కనపడిన వారందరినీ అడుగుతూ పాఠశాలకు చేరుకుంది. జరిగిన విషయాన్ని తెలిపి బాధితురాలికి హెచ్‌ఎం చంద్రావతి నగదును అందజేసి ఔçనత్యాన్ని చాటిన విద్యార్థి రమేష్‌ను ఉపాధ్యాయబృందం అభినందించారు.
Advertisement
Advertisement