నిజాయితీగా ఉంటేనే న్యాయం చేయగలం | To be honest, to be fair | Sakshi
Sakshi News home page

నిజాయితీగా ఉంటేనే న్యాయం చేయగలం

Published Sun, Aug 28 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

To be honest, to be fair

వరంగల్‌ : నీతి, నిజాయితీతో కేసుల పరిశోధన చేపడితే ప్రజలకు తప్పకుండా న్యాయం చేయగలమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు అన్నారు. కమిషనరేట్‌ పరిధిలో వినూత్న తరహాలో ‘అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసుల మేళా’ను Ô¶ నివారం కేయూ క్రాస్‌రోడ్‌లోని గోల్డెన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈమేళాలో కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోలీసు స్టేషన్ల వారిగా దర్యాప్తు స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈమేళాను ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు. 
విధి విధానాలు రూపొందించేందుకు మేళా
భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఏదైనా నేరం జరిగి కేసు నమో దు మొదలుకొని కేసులోని నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించే వరకు పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యల విధి విధానాలను రూపొందించేందుకు ఈ మేళా ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. ఈమేళాలో పోలీసు అధికారుల సూచనలతో 16పాయింట్ల విధి విధానాలను అనుసరించి పోలీస్‌స్టేçÙన్‌ పరిధిలో కానిస్టేబుల్‌ నుంచి స్టేషన్‌ అధికారి వరకు కేసుల దర్యాప్తులను పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడంతో పాటు కేసుల్లో నిందితులకు శిక్ష పడేందుకు ఉపయోగ పడుతాయన్నారు. 
పెండింగ్‌ కేసుల పరిష్కారం
ఎక్కువ కాలం పెండింగ్, దర్యాప్తులో ఉన్న కేసులను ఈసందర్భంగా పరిష్కరించినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన ప్రతీ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్‌లో ప్లా న్‌ ఆఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ను స్టేషన్‌ అధికారి చేతి రాతతో రాయాలని, దీన్ని ఏసీపీలు ఆప్రూవల్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రాయడం వల్ల దర్యాప్తు వేగవంతంగా జ రిగి దోషులకు తొందరగా శిక్ష పడే అవకాశాలున్నాయన్నారు. ప్రజల కు మనపై ఉన్న నమ్మకాన్ని రెట్టిం పు చేసుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. కమిషనరేట్‌కు రాష్ట్రం లోనే మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి పోలీస్‌ శ్రమించాలని ఆయన కోరారు. ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్థన్, మహేందర్, సురేంధ్రనాథ్, రవీందర్‌రావు, ఈశ్వర్‌రావుతో పాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement