పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత | Iphone and purse handover to women who lost it | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత

Published Fri, Jul 14 2017 9:26 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత

పోగొట్టుకున్న ఐఫోన్ యువతికి అప్పగింత

హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్‌): ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఓ యువతి పోగొట్టుకున్న పర్సును దక్కన్‌ మానవ సేవా సమితి ప్రతినిధులు దాన్ని తిరిగి ఆమెకు అప్పగించారు. గత సోమవారం శివాజీనగర్‌కు చెందిన స్నేహలత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చి పొరపాటున తన పర్సును పోగొట్టుకుంది. అందులో రూ.30 వేలకు పైగా విలువ చేసే ఐఫోన్, రూ.3 వేల నగదు, ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు, పాన్‌కార్డు ఉన్నాయి.

ఈ పర్సు దేవాలయం వద్ద విధుల్లో ఉన్న దక్కన్‌ మానవ సేవా సమితి ప్రతినిధికి దొరికింది. దీంతో పర్సులో ఉన్న మొబైల్‌ నంబర్ల ఆధారంగా ఫోన్లు చేసి సంప్రదించి, యువతి స్నేహలతకు బుధవారం రాత్రి ఐఫోన్, పర్సు అందజేశారు. దక్కన్‌ మానవ సేవా సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శీలం ప్రభాకర్, ప్రతినిధులు, సీకే నర్సింగరావు, జ్ఞానేశ్వర్‌ తదితరులకు ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement