జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్‌స్టంట్ మెడిసిన్స్ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.
పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్ పెట్టొచ్చు ఇలా..
►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి.
► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి.
► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి.
► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్‌మెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్.. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
► బీట్‌రూట్ జ్యూస్‌లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్‌రూట్ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
► టాబ్లెట్లల కంటే నాజిల్ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్‌స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు.
వీటితో పాటు జలుబు అటాక్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్ వేసుకున్నా, హోమ్ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment