రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్‌ పెరుగుతుందా? | Amazing Benefits Of Clapping Therapy For Overall Health, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Clapping Therapy In Telugu: క్లాపింగ్‌ థెరపీ.. డిప్రెషన్‌ను పోగొడుతుంది, గుండె ఆరోగ్యం బావుంటుంది

Published Sat, Nov 25 2023 4:44 PM | Last Updated on Sat, Nov 25 2023 5:59 PM

Amazing Benefits Of Clapping Therapy For Overall Health - Sakshi

ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్‌ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... 

సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్‌ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్‌ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్‌ అయ్యింది. క్లాపింగ్‌ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే..

మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి.


కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 

చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. 

చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్‌ థెరపీ ని అనుసరించవచ్చు.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement