claps
-
రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్ పెరుగుతుందా?
ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... ►సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. క్లాపింగ్ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే.. ►మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ►చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి. ►కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ►చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. ► చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్ థెరపీ ని అనుసరించవచ్చు. -
గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!
అమెరికాకు చెందిన 20 ఏళ్ల డాల్టన్ మేయర్ తప్పట్లతో గిన్నిస్ రికార్డు సాధించాడు. అదీకూడ ఒక నిమిషంలో 1,140 సార్లు క్లాప్స్(చప్పట్లు) కొట్టి రికార్డు సృష్టించాడు డాల్టన్ మేయర్. ఈ మేరకు డాల్టన్ మాట్లాడుతూ...దీనికోసం ప్రాక్టీస్ అవసరం లేదంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చప్పట్లు కొట్టే కేట్ ఫ్రెంచ్ యూట్యూబ్‌ని చూసి ఆసక్తి పెంచుకున్నట్లు చెబుతున్నాడు. ఇంతకముందు బిషప్ పేరిట ఒక నిమిషంలో 1,103 క్లాప్స్‌తో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు డాల్టన్. అతను డెవలప్ చేసిన మణికట్టు క్లాప్స్నే ఉపయోగించి ఇంతలా వేగవంతంగా క్లాప్స్ కొట్టగలిగానని చెప్పాడు. ఈ క్లాప్స్ సౌండ్‌ని ఇల్లినాయిస్కు చెందిన చార్మ్ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో రికార్డు చేశారు. ఐతే ఈ క్లాప్స్ ఒక చేతి మణికట్టుని మరో చేతి వేళ్లతో ఆనించి చప్పట్లు కొట్టాలి. డాల్టన్ తన క్లాప్స్ ఆడియో సరిగా రికార్డు అవుతుందో లేదో తెలుసుకునేందుకు సదరు మీడియా గ్రూప్‌తో కొన్నాళ్లు పనిచేసినట్లు తెలిపాడు. (చదవండి: ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో) -
క్లాప్ క్లాప్... సితార
తండ్రి మహేశ్‌బాబు సినిమాకి సితార క్లాప్ కొట్టింది. భర్త మహేశ్ కోసం నమ్రత కెమెరా స్విచాన్ చేశారు. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కి నమ్రత కెమెరా స్విచాన్ చేయగా, సితార క్లాప్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఓ గుడిలో జరిగిన ఈ వేడుకలో సితార సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్. ఎస్.ఎస్, కెమెరా: మది, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట. -
కొత్త చరిత్రకు ఏపీ చప్పట్లు
నిజం! పింఛన్ల కోసం ఎండల్లో గంటల తరబడి మాడిపోయిన వృద్ధులు, వికలాంగుల్ని చూశాం. రేషన్ కార్డు కోసం కాళ్లీడ్చుకుంటూ ఎన్ని రోజులు తిరిగామో లెక్క కూడా చెప్పలేం!!. దరఖాస్తు ఏదైనా బస్సులెక్కి ఊళ్లుదాటి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటికీ స్వస్తి చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. సచివాలయ వ్యవస్థ దిగ్విజయంగా ఏడాది పూర్తిచేసుకుంది. ప్రభుత్వంతో ఏ పని ఉన్నా ఇంటి ముంగిట వచ్చి వాలే గ్రామ వలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సహకారంతో అద్భుతంగా పనిచేశారు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన క్షణాన దేశమంతటా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించటానికి తంటాలూ పడుతూ వ్యాధి భయంతో కన్నవారిని పిల్లలే వదిలేస్తున్న క్షణాన... ఏపీలో వలంటీర్లు్ల క్రమశిక్షణతో పనిచేశారు. ఇల్లిల్లూ చుట్టి... లక్షణాలున్న వారిని.. లేకుండానే వ్యాధిన పడ్డవారిని గుర్తించారు. ముందే చికిత్స అందించి కోవిడ్ భయాన్ని, మరణాల రేటును గణనీయంగా తగ్గించారు. అందుకే వారికి ఈ అభినందనలు. ఇదో చరిత్ర. యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటున్న సరికొత్త చరిత్ర!. సచివాలయ వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సైతం తన అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు వారి కృషికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. (చదవండి: గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు) వలంటీర్లు కాదు.. వారియర్లు సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మునుపెన్నడూ లేనంత వేగంగా, అవినీతికి తావులేకుండా తమకు అందుతున్న సేవలకు మద్దతుగా రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ సంతోషాన్ని ప్రకటించారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చప్పట్లతో మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమ నిర్వహణకు పిలుపునివ్వగా.. సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి చోటా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా కొనసాగించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తమ ఇంటి గడప వద్దనే అనేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన కోట్లాది మంది సామాన్యులు మొదలు.. ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సొంత ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవలం తొమ్మిది నెలల్లోనే దాదాపు కోటి సంఖ్యలో ప్రజల సమస్యలు పరిష్కారమైన విషయం తెలిసిందే. నేను సైతం అంటూ సీఎం.. ఒంగోలు సమతానగర్‌లో చప్పట్లతో వలంటీర్లను అభినందిస్తున్న స్థానికులు ► గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్ల సేవలను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం తన అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు, ప్రత్యేకించి అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల వల్ల లబ్ధి పొందిన పొదుపు సంఘాల మహిళలు పలుచోట్ల ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి, అభినందనల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దేశాన్ని ఆకర్షించిన వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడాది కిత్రం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఐఏఎస్‌ల శిక్షణలో ఒక పాఠ్యాంశం అయ్యేంతగా ప్రాచుర్యం పొందింది. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సైతం కొనియాడారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా అభినందించారు. ఏలూరులో సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న మహిళలు గ్రామ స్వరాజ్యం సాకారం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సాకారం అయిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అమల్లోకి వచ్చి శుక్రవారానికి ఏడాది అయింది. గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. ► గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇవాళ సాకారమవుతోంది. దాన్ని ఇన్నాళ్లూ పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప చూడలేదు. కానీ ఇవాళ గ్రామ స్వరాజ్యం అంటే ఇదే అని రాష్ట్రంలో చూపిస్తున్నాము. అందుకు గర్వంగా ఉంది. ► ఏడాదిగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నాము. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందేలా చేశాము. గ్రామాల్లోనే ఉంటూ, మన ఇంటి వద్దకే వచ్చి, ఏ సహాయం కావాలన్నా, వివక్ష చూపకుండా, లంచాలకు తావు లేకుండా అన్నీ చేసి పెడుతున్న వలంటీర్ల సేవలు అభినందనీయం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రోత్సహిద్దాం. -
జనతా కర్ఫ్యూ : వారికి టాలీవుడ్ సలాం..
హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు మోదీ పిలుపు మద్దతుగా నిలిచి.. ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లతో అభినందనలు తెలిపిన వీడియోను కొందరు తెలుగు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనందరి కోసం పనిచేస్తున్నవారికి ప్రజలు బాల్కనీలో నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలుపడం గౌరవంగా ఉందని హీరో రామ్‌చరణ్ అన్నారు. మరో హీరో ఎన్టీఆర్ వైద్య, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి తన కుమారుడితో కలిసి చప్పట్లు, గంట కొట్టి అభినందనలు తెలిపారు. చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపిన మంచు మనోజ్.. వందేమాతరం అంటూ నినదించారు. మెగా ఫ్యామిలీ, మోహన్‌బాబు కుటుంబం, అల్లు ఫ్యామిలీ, రాజశేఖర్ -జీవిత ఫ్యామిలీ, శ్రీకాంత్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం, సుకుమార్ ఫామిలీ లు కూడా తమ చప్పట్లతో ప్రజల కోసం సేవలు అందిస్తున్న వైద్య, పారిశుద్ధ్య, అత్యవసర విభాగాల సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఇంకా సినీ ప్రముఖులు చార్మి, శ్రీకాంత్, గుణశేఖర్, పూజా హెగ్డే, గోపిచంద్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, పవన్ కల్యాణ్, రమ్యకృష్ణ, కృష్ణవంశీ, నిఖిల్, విశ్వక్‌సేన్‌లు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. Spl thanks to all the Doctors,Nurses,Police,Army and many more serving the society. Gratitude. #jantacurfew pic.twitter.com/XhLW9jJ5Pc — Allu Arjun (@alluarjun) March 22, 2020 Anjana Devi garu, Chiranjeevi garu and family showing their appreciation and respect towards all the authorities and people in the medical field.#JanataCurfew #clapforourcarers pic.twitter.com/ET8fG6mpAa — Konidela Pro Company (@KonidelaPro) March 22, 2020 Grateful for all the healthworkers🙌🙏 pic.twitter.com/8OJCDJP9SF — Dr.Rajasekhar (@ActorRajasekhar) March 22, 2020 -
జనతా కర్ఫ్యూ : వారికి టాలీవుడ్ సలాం..
-
'బల్లలు చరవాల్సిన అవసరం నాకులేదు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అంతా సానుకూలంగా ఉన్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. శనివారం విజయవాడలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ సీటు కావాలంటే ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లకూడదని, అలాగే ప్రత్యేక హోదా కావాలంటే ఇక్కడ బంద్‌లు చేసేకంటే ఎవరైతే దాన్ని ఇవ్వాలో అక్కడికెళ్లి చేయాలని ప్రతిపక్షాలను విమర్శించారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి హడావుడి చేసిందని ఆరోపించారు. కానీ ఈ అంశంపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నప్పుడు 44 మంది ఎంపీలున్న ఆ పార్టీ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని నిర్మాణాత్మకంగా హోదా సాధన కోసం పనిచేయాలని సూచించారు. ఈ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేక హోదా బిల్లును లోక్‌సభకు పంపుతున్నప్పుడు రాజ్యసభలో తాను చప్పట్లు కొట్టానని వక్రీకరిస్తున్నారని, దానికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సుజనా చౌదరి అన్నారు. పార్లమెంటులో తాను నవ్వానా, నుంచున్నానా, కూర్చున్నానా అని చూడొద్దని తన చిత్తశుద్ధిని చూడాలని కోరారు.ప్రత్యేక హోదాపై తన వంతుగా కష్టపడుతున్నానని, విభజన సమయంలోనూ పోరాటం చేశానని చెప్పారు. ఆందోళనలు చేసి రోడ్లెక్కడం వల్ల సాధించేదేమీ ఉండదని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. వీటి ద్వారానే తాము రాష్ట్రానికి కొన్ని సాధించామని ఇంకా చాలా సాధించాల్సివుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కచ్చితంగా రావాలని, అదే సమయంలో మిగిలిన పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన ప్రాంతానికి నిధులు కూడా సాధించుకోవాలన్నారు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత రెవెన్యూలోటు కొంత మెరుగుపడిన మాట వాస్తవమేనని అయినా ఇంకా ఇబ్బందులున్నాయని, వాటన్నింటినీ పూర్తిగా పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. హోదాతోపాటు వీటన్నింటినీ సాధించుకునేందుకు నయానో, భయానో ప్రయత్నిస్తామన్నారు. హోదా వస్తుందనే గ్యారంటీ ఇవ్వలేనని, కానీ సాధించుకోగలననే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పెట్టిన ప్రైవేటు బిల్లు మనీ బిల్లని రాజ్యాంగ నిపుణులు చెప్పారని తెలిపారు. కాగా శుక్రవారం రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగి ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు. అది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్‌సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. ఇలా కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సుజనా చేష్టలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.