Man Breaks Guinness World Record Most Claps In Minute With 1140 - Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!

Published Sat, Nov 5 2022 3:12 PM | Last Updated on Sat, Nov 5 2022 4:06 PM

Man Breaks Guinness World Record Most Claps In Minute With 1140 - Sakshi

వేగవంతంగా క్లాప్స్‌ కొట్టి రికార్డు సృష్టించాడు..

అమెరికాకు చెందిన 20 ఏళ్ల డాల్టన్‌ మేయర్‌ తప్పట్లతో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. అదీకూడ ఒక నిమిషంలో  1,140 సార్లు క్లాప్స్‌(చప్పట్లు) కొట్టి రికార్డు సృష్టించాడు డాల్టన్‌ మేయర్‌. ఈ మేరకు డాల్టన్‌ మాట్లాడుతూ...దీనికోసం ప్రాక్టీస్‌ అవసరం లేదంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చప్పట్లు కొట్టే కేట్‌ ఫ్రెంచ్‌ యూట్యూబ్‌ని చూసి ఆసక్తి పెంచుకున్నట్లు చెబుతున్నాడు.

ఇంతకముందు  బిషప్‌ పేరిట ఒక నిమిషంలో 1,103 క్లాప్స్‌తో ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు డాల్టన్‌. అతను డెవలప్‌ చేసిన మణికట్టు క్లాప్స్‌నే ఉపయోగించి ఇంతలా వేగవంతంగా క్లాప్స్‌ కొట్టగలిగానని చెప్పాడు. ఈ క్లాప్స్‌ సౌండ్‌ని  ఇల్లినాయిస్‌కు చెందిన చార్మ్ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో రికార్డు చేశారు. ఐతే ఈ క్లాప్స్‌ ఒక చేతి మణికట్టుని మరో చేతి వేళ్లతో ఆనించి చప్పట్లు కొట్టాలి. డాల్టన్‌ తన క్లాప్స్‌ ఆడియో సరిగా రికార్డు అవుతుందో లేదో తెలుసుకునేందుకు సదరు మీడియా గ్రూప్‌తో కొన్నాళ్లు పనిచేసినట్లు తెలిపాడు. 

(చదవండి: ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement