సాధారణంగా జ్వరం వచ్చి తగ్గినప్పుడు పథ్యం కూరలా బీరకాయ వండుతుంటారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, పీచుపదార్థం ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం.
నిజానికి బీరకాయను పథ్యం కూరలా కాదు, ఆహారంలో తరచు భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులు అంటున్నారు.
ఆరోగ్య లాభాలు
►సాధారణ, నేతి బీరకాయ– రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్ –సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థైమీన్ ... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
►సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ నివారిస్తుంది.
►బీరకాయల్లోని పెప్టెడ్‌లు, ఆల్కలాయిడ్‌లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి.
షుగర్ ఉన్నవాళ్లు
►మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.
►రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది.
►దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.
కంటికండరాల బలహీనత తగ్గించి
►కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
►అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది.
►బీరకాయలోని విటమిన్ –ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని జాతీయ అంధత్వ నివారణ సంస్థ పేర్కొంటోంది.
రక్త హీనతతో బాధపడుతున్న వారికి
►ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట.
►బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది.
►ఇన్ని ప్రయోజనాలున్న బీరకాయను పథ్యంలా కాకుండా తరచు తీసుకోవడమే మంచిది కదా మరి.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.
చదవండి: Unwanted Hair Removal: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే..
Comments
Please login to add a commentAdd a comment