వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!
మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్‌లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది.
ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్‌విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు.
మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..
మామిడి తొక్క టీ:
మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.
మామిడి తొక్క ఊరగాయ:
తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి.
మామిడి తొక్కపొడి:
ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్‌లు, సూప్‌లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్‌గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్‌గా కూడా ఉపయోగించొచ్చ.
బ్యూటీ స్క్రబ్:
మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్‌గా ఉంటుంది.
జుట్టు సంరక్షణ:
ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది.
స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్‌గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.
(చదవండి: మామిడి బఫే..ఐస్‌క్రీం నుంచి బ్రేక్‌ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!)
Comments
Please login to add a commentAdd a comment