తీసి... పారేయకండి
ఫుడ్ ఫ్యాక్ట్స్
అరటిపండు తిని తొక్క పడేస్తాం..కానీ తొక్కతో చాలా లాభాలున్నాయి. అందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న ముడతలను మాయం చేస్తుంది. తాజా అరటిపండు తొక్కలోపలి భాగాన్ని కళ్లచుట్టూ సున్నితంగా రుద్దితే ముడుతలు, ఐ బాగ్స్ అడ్రస్ లేకుండా పోతాయి.
చీమ, దొమ వంటి కీటకాలు కుట్టిన చోట వాపు, దురదలాంటివి ఉంటే అరటిపండు తొక్కతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది.అరటిపండు మనుషులకే కాదు మొక్కలకూ ఆరోగ్యమే. పండు తిని తొక్కను డస్ట్‌బిన్‌లో వేయకుండా గులాబి మొక్కల తొట్లలో వేస్తే గులాబీలు విరగబూస్తాయి.