Summer Drink- Pomegranate Strawberry Juice: స్ట్రాబెరీలో విటమిన్ సి, కె, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటా షియం పుష్కలంగా ఉంటాయి. ఇక, దానిమ్మగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి.
కాబట్టి దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌తో పై పోషకాలన్నీ శరీరానికి అంది.. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు, అధిక రక్తపీడనం నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజ పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీకి కావలసినవి:
►దానిమ్మ గింజలు –రెండు కప్పులు
►స్ట్రాబెరీలు – ఆరు
►రాక్‌సాల్ట్ – టీస్పూను
►జీలకర్రపొడి – అరటీస్పూను
►నీళ్లు – పావు కప్పు
►ఐస్ క్యూబ్స్ – పది.
దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీ:
►స్ట్రాబెరీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి.
►బ్లెండర్‌లో దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు, రాక్ సాల్ట్‌ను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ను విడిగా తీసుకోవాలి.
►ఇప్పుడు జ్యూస్‌లో జీలకర్రపొడి, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ మరింత రుచిగా ఉండాలంటేæ తేనెను కలుపుకోవచ్చు.
►తాజాగా ఉన్న స్ట్రాబెరీ, దానిమ్మ గింజలతో చేసే ఈడ్రింక్ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్‌గా పనిచేస్తుంది.
►దీనిలో పంచదార వేయకపోవడం, వీగన్, గులెటిన్ ఫ్రీ కూడా కాబట్టి ఉపవాసంలో ఉన్నవారు కూడా ఈ జ్యూస్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు.
వేసవిలో ట్రై చేయండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే!
Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Comments
Please login to add a commentAdd a comment