Summer Drink: Apple Blueberry Juice Recipe and Health Benefits in Telugu - Sakshi
Sakshi News home page

Summer Drinks: యాపిల్‌, నేరేడు.. జ్యూస్‌ కలిపి తాగితే.. కలిగే లాభాలివే!

Published Fri, May 27 2022 12:44 PM | Last Updated on Fri, May 27 2022 2:23 PM

Summer Drinks: Apple Blueberry Juice Recipe Health Benefits - Sakshi

Summer Drinks: Apple Blueberry Juice: యాపిల్‌ నేరేడు జ్యూస్‌లో పీచుపదార్థంతోపాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్‌ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి సెల్‌ డ్యామేజ్‌ను నియంత్రిస్తాయి.

ఈ జ్యూస్‌ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి సైతం వేసవిలో ఈ డ్రింక్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

యాపిల్‌ నేరేడు జ్యూస్‌ తయారీకి కావలసినవి:
►గింజలు తీసేసిన నేరేడు పండ్లు – కప్పు
►యాపిల్‌ ముక్కలు – కప్పు
►బ్లాక్‌ సాల్ట్‌ – పావు టీస్పూను
►అల్లం – చిన్న ముక్క
►చాట్‌ మసాలా – చిటికెడు
►నిమ్మరసం – టేబుల్‌ స్పూను
►ఐస్‌ క్యూబ్స్‌ – ఐదు
►తేనె – రెండు టేబుల్‌ స్పూన్లు.  

తయారీ:
►నేరేడు, యాపిల్‌ ముక్కలు, అల్లం ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
►ముక్కలు నలిగాక, కప్పు నీళ్లు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.
►ఇప్పుడు ఈ జ్యూస్‌ను వడగట్టకుండా గ్లాసులో పోసి, తేనె, చాట్‌ మసాలా, ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి. ∙

వేసవిలో ట్రై చేయండి: Pomegranate Strawberry Juice: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌.. పోషకాలెన్నో! 
Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement