Summer Drinks: Kokum Solkadi Drink Recipe And Its Health Benefits In Telugu - Sakshi
Sakshi News home page

Kokum Solkadi Juice In Telugu: కొకుమ్‌ జ్యూస్‌.. వేసవిలో ఇది తాగితే ఎన్నో ప్రయోజనాలు!

Published Tue, May 31 2022 11:44 AM | Last Updated on Tue, May 31 2022 12:26 PM

Summer Drinks: Kokum Solkadi Juice Recipe Health Benefits - Sakshi

Summer Drink- Kokum Solkadhi Juice: కొంకణి కూరల్లో పులుపు కోసం వాడే ప్రధాన పదార్థం కొకుమ్‌. వేసవిలో భోజనం తరువాత ఈ జ్యూస్‌ను తప్పని సరిగా తాగుతారు . ఇది ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది 

జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్‌ ఎసిడిటీ సమస్యలను దరిచేరనియ్యదు. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ జ్యూస్‌ శరీరానికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. 

కొకుమ్‌ (సొల్‌కది) జ్యూస్ తయారీకి కావలసినవి: 
►ఎండు కొకుమ్స్‌ – 12
►చిక్కటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు
►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా
►నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
►ఆవాలు – టీస్పూను
►జీలకర్ర – టీస్పూను
►కరివేపాకు – ఒక రెమ్మ
►ఇంగువ – చిటికెడు
►వెల్లుల్లి రెబ్బలు – రెండు. 

తయారీ: 
►కొకుమ్స్‌ను శుభ్రంగా కడిగి, కప్పు నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి 
►అరగంట తరువాత కొకుమ్స్‌ను బాగా పిసకాలి. తరువాత వడగట్టి రసాన్ని వేరు చేయాలి 
►ఇప్పుడు ఈ రసానికి రెండు కప్పులు నీళ్లు, కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పక్కనపెట్టుకోవాలి 
►బాణలిలో ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి 
►ఇప్పుడు ఇంగువ కరివేపాకు, వెల్లుల్లిని దంచి వేయాలి 
►ఇవన్నీ వేగాక కొకుమ్‌ జ్యూస్‌లో కలిపి, రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి 
►చల్లబడిన జ్యూస్‌లో చివరిగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

ఇది కూడా ట్రై చేయండి: Pineapple- Keera: పైనాపిల్‌ కీరా జ్యూస్‌ తాగుతున్నారా.. ఇందులోని బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ వల్ల!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement